క్యూలెక్స్‌ దోమతో జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

క్యూలెక్స్‌ దోమతో జాగ్రత్త

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

కొయ్యలగూడెం: అరుదైన ఆడ క్యూలెక్స్‌ దోమ కొయ్యలగూడెంలోని ఓ ప్రాంతంలో కనిపించింది. ఆడ క్యూలెక్స్‌ దోమ అనేది ఒక వ్యాధి వాహకం అని ప్రొఫెసర్‌ డాక్టర్‌ బీవీ శ్రీనివాస్‌ తెలిపారు. సాధారణ దోమ కంటే పదింతలు పెద్దదిగా, అంగుళం ఎత్తు, అంగుళం పొడవు ఉన్న దీనిని స్థానికులు ఒక గ్లాసులో బంధించి కొద్దిసేపు ఉంచారు. దాని ఆకారాన్ని చూసి భయకంపితులయ్యారు. కాగా, ఇది ‘వుచేరేరియా బాంక్రాఫ్టి’ అనే నులిపురుగు పరాన్నజీవి యొక్క మైక్రోఫైలేరియా లార్వాలను మోసుకెళ్తుందని, తద్వారా ఫైలేరియాసిస్‌ లేదా ఏనుగు వ్యాధిని కలిగిస్తుందని ఆయన వివరించారు. ఆడ క్యూలెక్స్‌ దోమ కుడితే, దాని శరీరంలో ఉన్న సన్నని పురుగులు మన రక్తంలోకి వెళ్తాయని, ఆ పురుగులు శరీరంలో పెరిగి లింఫ్‌ గ్రంథులను పాడుచేస్తాయని తెలిపారు. దానివల్ల కాళ్లు, చేతులు ఏనుగు కాళ్లలా వాచిపోతాయని, దాన్నే బోదకాలు వ్యాధి లేదా ఏనుగు కాలు వ్యాధి (ఫైలేరియా) అంటారని పేర్కొన్నారు. అయితే, ఇటువంటి దోమలు ఇంకా కొయ్యలగూడెం పట్టణంలో ఉండవచ్చని, ఇవి కనుక మనుషులపై దాడి చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే భయం కలుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమల నివారణకు పంచాయతీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్ప్రేయింగ్‌ (పిచికారీ) పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement