అస్తవ్యస్తం.. అయోమయం | - | Sakshi
Sakshi News home page

అస్తవ్యస్తం.. అయోమయం

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

గౌరవ వేతనానికి ఎగనామం

న్యూస్‌రీల్‌

గౌరవ వేతనానికి ఎగనామం
ప్రజాప్రతినిధులకు కూటమి సర్కారు గౌరవ వేతనాన్ని ఎగ్గొట్టింది. ఎంపీపీలు, ఎంపీటీసీలకు రూ.9.45 కోట్లు, జెడ్పీటీసీలకు రూ. 1.03 కోట్ల బకాయిలు ఉన్నాయి. 8లో u

బుధవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

సాక్షి, భీమవరం: త్వరలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో ఐదు మున్సిపాల్టీలు, ఒక నగర పంచా యతీ ఉన్నాయి. విలీన సమస్యలతో నాలుగు మున్సిపాల్టీలో ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగక పోవడం అశావహులను అయోమయంలో పడేస్తోంది. మరోపక్క నరసాపురం, ఆకివీడులో వార్డుల పునర్విభజన అస్తవ్యస్తంగా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం మున్సిపాల్టీలు, ఆకివీడు నగర పంచాయతీలు కాగా.. పట్టణాల్లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని గ్రామాల ప్రజలు కోర్టులను ఆశ్రయించడంతో ఏడేళ్లుగా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాలు ప్రత్యేక పాలనలో ఉండిపోయాయి. విలీన అడ్డంకులు లేని నరసాపురం, ఆకివీడుకు 2021లో ఎన్నికలు జరిగాయి. త్వరలో ఈ రెండు పట్టణాల్లో ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతోంది.

రెండు చోట్లే విభజన

వార్డుల పునర్విభజనలో నరసాపురంలోని 31 వార్డులను 36కు, ఆకివీడులో 20 నుంచి 28 వార్డులకు పెంచారు. వీటి విభజన లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలున్నాయి. కూటమి నేతల ఒత్తిళ్లతో వైఎస్సార్‌సీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకుని అధికారులు విభజన చేశారంటున్నారు. వారికి అనుకూలంగా వార్డుల సరిహద్దులు, ఓటర్ల సంఖ్యను సర్దుబాటు చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నరసాపురంలోని చాలా వార్డుల్లో సంబంధం లేని మరో ప్రాంతం నుంచి ఓటర్లను తెచ్చి చేర్చడంతో కొందరికి పలు వార్డుల్లో ఓటుహక్కు వచ్చిన చిత్రాలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. ఆకివీడులోని వార్డుల్లో ఓటర్ల సంఖ్య మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది. ఒక్కో వార్డులో 900 నుంచి 1,000 లోపు ఓటర్లు ఉండాల్సి ఉంటే కొన్నిచోట్ల 700 లోపు ఉంటే మరికొన్ని వార్డుల్లో 1,100కు పైగా ఓటర్లు ఉన్నారు. పునర్విభజన లోపాలను సరిచేయాలని ఇప్పటికే రెండు పట్టణాల నుంచి ఉన్నతస్థాయికి వినతులు అందాయి.

నాలుగు పట్టణాల్లో కేసులతో..

భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లులో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. వార్డుల విభజనకు నోటిఫికేషన్‌ జారీకాక ఆశావహులు అయోమయంలో ఉన్నారు. విలీన పంచాయితీని పక్కన పెట్టి ఎన్నికలు నిర్వహిస్తారని కొందరు, కేసులు పరిష్కారం తర్వాతనే ఎన్నికలని మరికొందరు ఎవరి లెక్కల్లో వారున్నారు.

ఆకివీడు ఎన్నికల్లో విజయమే లక్ష్యం

వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ అమర్నాథ్‌

పుర పోరు.. వార్డులు బేజారు

నరసాపురం, ఆకివీడులో లోపభూయిష్టంగా వార్డుల విభజన

కూటమికి అనుకూలంగా చేశారన్న ఆరోపణలు

భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలో విభజనకు నోచుకోని వార్డులు

ఎన్నికల నిర్వహణపైనా నీలినీడలు

సందిగ్ధంలో ఆశావహులు

ఆకివీడులోని 20 వార్డులను 28 వార్డులకు పెంచారు. ప్రస్తుతం పట్టణంలో 26,335 మంది ఓటర్లకు గాను ఒక్కో వార్డులో వెయ్యి మందిలోపు ఓటర్లను సర్దుబాటు చేయాలి. ఈ మేరకు వార్డులోని ఓటర్లు 900 నుంచి 1,000 మధ్య ఉండాలి. అందుకు భిన్నంగా మూడు వార్డుల్లో 700 లోపు, మూడు వార్డుల్లో 800 లోపు, ఐదు వార్డుల్లో 900 లోపు, ఎనిమిది వార్డుల్లో వెయ్యిలోపు, తొమ్మిది వార్డుల్లో ఏకంగా 1,000 నుంచి 1,400 వరకు ఓట్లను సర్దుబాటు చేశారు. 3వ వార్డులో కేవలం 664 మంది ఓటర్లు ఉంటే.. 22వ వార్డులో రెండింతలకు పైగా 1,347 ఓట్లు ఉండటం గమనార్హం.

వార్డుల పునర్విభజనలో నరసాపురంలో పాత 21, 30 వార్డులు ఇప్పుడు 34, 35, 36లుగా మారాయి. 30వ వార్డు రైల్వేస్టేషన్‌ కాలువ గట్టు ప్రాంతాన్ని 24వ వార్డులో కలపాల్సి ఉంటే 36వ వార్డులోకి, రైల్వేస్టేషన్‌ వెనుక ప్రాంతాన్ని 34వ వార్డులోకి చేర్చారు. పాత 18వ వార్డును 20వ వార్డుగా మార్చి దేవునితోట చుట్టుపక్కల ప్రాంతాన్ని సంబందంలేని 19వార్డుకి, ఇదే వార్డులో లేని హైస్కూల్‌, మొగల్తూరు రోడ్డు ప్రాంతాలను 15లోకి చేర్చారు. 1వ వార్డు లాకుపేటలో కొంత ప్రాంతాన్ని సంబందంలేని గోదావరి గట్టున ఉన్న 2వ వార్డులోకి చేర్చారు. ఇలా ఎందుకు చేశారన్నది అంతుచిక్కని విషయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement