ప్రాణాలు తీసిన తమ్మిలేరు గోతులు | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన తమ్మిలేరు గోతులు

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

ప్రాణాలు తీసిన తమ్మిలేరు గోతులు

తమ్మిలేరులో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు

అగాధాల్లా మారిన గోతులు

స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థుల మృతి

ఏలూరు టౌన్‌: ఏలూరు శివారు తమ్మిలేరులో స్నానానికి దిగిన ఇద్దరు జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు మృత్యువాతపడ్డారు. తమ్మిలేరులో ఇసుక అక్రమ తవ్వకాలతో ఏర్పడిన భారీ గోతులతో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం ముగ్గురు స్నేహితులు సరదాగా తమ్మిలేరులో స్నానానికి వెళ్లారు. విద్యార్థుల తల్లితండ్రి, బంధువులు వారి మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సోమవారం ఓ విద్యార్థి మృతదేహం లభ్యం కాగా.. మంగళవారం ఉ దయం మరో విద్యార్థి మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించింది.

ముగ్గురు స్నానానికి దిగి.. ఏలూరు శనివారపుపేట ప్రాంతానికి చెందిన కనకం దేవేందర్‌ పవన్‌ (17), షేక్‌ కరీం రోషన్‌ (17), జక్కుల శ్యామ్‌ ఒకే కళాశాలలో జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్నారు. వీరి ముగ్గురూ సోమవారం కళాశాల మానివేసి ఫంక్షన్‌ ఉందంటూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లారు. సా యంత్రం 4 గంటలకు ఏలూరు దొండపాడు వీ వర్స్‌ కాలనీ సమీపంలో తమ్మిలేరు కాలువలోకి స్నానానికి దిగారు. నీటి ప్రవాహానికి కరీమ్‌, రోషన్‌, శ్యామ్‌ నీటిలో మునిగిపోయారు. అక్కడే స్నానం చేస్తున్న వ్యక్తులు శ్యామ్‌, దేవేందర్‌ పవన్‌ ను కాపాడి బయటకు లాగారు. దేవేందర్‌ పవన్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు. శ్యామ్‌ ప్రమా దం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.

వంద మీటర్ల దూరంలో మరో మృతదేహం

నీటిలో గల్లంతైన రోషన్‌ కోసం అగ్నిమాపకశాఖ, పోలీస్‌ శాఖ సోమవారం రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం సంఘటనా స్థలానికి వంద మీటర్ల దూరంలో తూడు వద్ద రోషన్‌ మృతదేహం నీటిపై తేలడంతో గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసి ఏలూరు జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. ఇద్దరు విద్యార్థుల మృతదేహాలకు త్రీటౌన్‌ పోలీసులు శవపంచనామా నిర్వహించగా.. జీజీహెచ్‌ వైద్యులు పోస్టుమార్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement