నకిలీ విత్తనాలతో మునిగాం | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలతో మునిగాం

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

నకిలీ విత్తనాలతో మునిగాం విభజన సరిలేదు వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌ నిబంధనలకు తిలోదకాలు

నకిలీ మొక్కజొన్న విత్తనాలతో తమను మోసం చేసిన ఆర్గనైజర్‌పై చర్యలు తీసుకోవాలని, పరిహారం ఇప్పించాలంటూ రైతులు నిరసన తెలిపారు. 8లో u

ఆకివీడులో 20 వార్డులను 28కు పెంచారు. ఓటర్లను ఇష్టానుసారం సర్దుబాటు చేయడంతో విభజన ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉంది. 13వ వార్డులో నేను గెలుపొందాను. అప్పట్లో వార్డులో 1,360 ఓటర్లున్నారు. ప్రస్తుత విభజనలో 1,347 మంది ఉన్నారు. లోపాలను సరిచేయాలి.

– జామి హైమావతి,

నగర పంచాయతీ చైర్‌పర్సన్‌, ఆకివీడు

నరసాపురంలో ఒక పద్ధతి లేకుండా కొందరు వైఎస్సార్‌సీపీ నేతల వార్డులను టార్గెట్‌ చేసి విభజించినట్టు కనిపిస్తోంది. అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి అభ్యంతరాలు, సలహాలు తీసుకోకుండా అధికారులు ఇష్టానుసారం వ్యవహరించారు. అన్ని వార్డుల్లో ఇదే పరిస్థితి.

– కామన బుజ్జి,

వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు, నరసాపురం

ఎన్నడూ లేనివిధంగా పట్టణంలో వార్డుల విభజన ని బంధనల్ని తుంగలో తొ క్కారు. విభజనపై అడిగినా పట్టించుకోలేదు. నచ్చినట్టుగా వార్డుల్లో ఓటర్లను సర్దుబాటు చేసేశారు. ఇదేంటని అడిగితే పట్టించుకునే వారు లేరు. అధికారులు ఒంటెద్దు పోకడతో విభజన చేశారు.

– మన్నే పోతరాజు, మాజీ సర్పంచ్‌, ఆకివీడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement