వీఆర్‌ఏల అర్ధనగ్న ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏల అర్ధనగ్న ప్రదర్శన

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

వీఆర్‌ఏల అర్ధనగ్న ప్రదర్శన బిందు సేద్యం మేలు పట్టణాభివృద్ధికి కృషి ‘ఉద్యాన’ వీసీకి అంతర్జాతీయ గౌరవం జిల్లాలో మీ మార్టులు

పాలకొల్లు సెంట్రల్‌: తమ న్యాయపరమైన స మస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) చేస్తున్న స హాయ నిరాకరణ ఉద్యమం ఎనిమిదో రోజుకు చేరుకుంది. మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద దీక్ష చేస్తున్న వీఆర్‌ఏలు అర్ధనగ్న ప్రదర్శనగా నిరసన తెలిపారు. తమకు పేస్కేలు, డ్రైవర్‌, అటెండర్‌, నైట్‌ వాచ్‌మన్‌ పదోన్నతులు, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాలని, నామినీ వీఆర్‌ఏలను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

తాడేపల్లిగూడెం రూరల్‌: బిందు సేద్యంతో ఉద్యాన మొక్కలను పరిరక్షించుకోవచ్చని ఉ ద్యాన శాఖ డైరెక్టర్‌ (విజయవాడ) డాక్టర్‌ సీ హెచ్‌ పద్మావతి అన్నారు. మండలంలోని ఎల్‌నినో ప్రభావిత ఎల్‌.అగ్రహారం, కొండ్రుప్రో లు, మెట్ట ఉప్పరగూడెం, కుంచనపల్లి గ్రామాల్లో ఉద్యాన శాఖ అధికారులు మంగళవారం పర్యటించారు. జామ, ఆయిల్‌పామ్‌, కోకో, కొబ్బరిలో మల్చింగ్‌, వీడ్‌ మ్యాట్‌ ద్వారా నీటిని మొక్కలకు ఆవిరి కాకుండా చూడవచ్చన్నారు. పంటల్లో తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి కిరణ్‌కుమార్‌, జిల్లా సూక్ష్మ నీటి అధికారి పి.వీరభద్రరావు, మండల ఉద్యాన శాఖ అధికారి శ్రీలక్ష్మి, సిబ్బంది ఉన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల మెరుగుకు ప్రభుత్వం చేపట్టిన హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హెచ్‌ఏఎం) అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు కుప్పం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని భీమవరంలోని ఆనంద్‌ ఇన్‌ హాల్‌లో కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని వీక్షించారు. తొలుత కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో అభివృద్ధికి సుమారు రూ.210 కోట్లు మంజూరు కాగా, భీమవరానికి రూ.43 కోట్ల నిధులు కేటాయించారన్నారు.

తాడేపల్లిగూడెం: ఉద్యాన రంగంలో విశేష సేవలకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ కె.ధనుంజయరావుకు అంతర్జాతీయ గౌ రవం దక్కింది. డాక్టర్‌ హెచ్‌బీ సింగ్‌ అవార్డును వీసీకి డిసెంబర్‌ 3న ఉత్తరాఖండ్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సులో ప్రదానం చేయనున్నారు. ఉద్యాన రంగంలో విశేష సేవలు, పరిశోధన, విద్యార్థులకు మార్గదర్శక సేవలను గుర్తిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అలాగే ధనుంజయరావు నేతృత్వంలో పలు నూతన ఆవిష్కరణలు జరిగాయి. ఇవి ఉద్యాన పంటల ఉత్పత్తిని, నాణ్యతను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ పురస్కారాన్ని వ్యక్తిగత విజయంగా కాకుండా సహచరులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, విశ్వవిద్యాలయ సిబ్బంది సమష్టి కృషికి గుర్తింపుగా భావిస్తున్నానని ధనుంజయరావు అన్నారు. రైతుల సంక్షేమం, ఉద్యాన రంగ అభివృద్ధికి భవిష్యత్‌లో మరింత కృషి చేస్తానని చెప్పారు. ఆయనకు వర్సిటీ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

భీమడోలు: ఏలూరు జిల్లాలో త్వరలో వంద మీ మార్ట్‌లు ఏర్పాటు చేయనున్నామని జా యింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ అన్నారు. మంగళవారం పూళ్ల, ఎంఎంపురం గ్రామాల్లో సర్‌, రీసర్వే, మీ మార్ట్‌ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. సర్‌, రీసర్వేలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎంఎం పురంలో రేషన్‌ షాపు–32లో ఏర్పాటు చేస్తున్న మీ మార్ట్‌ను సందర్శించారు. రేషన్‌ షాపులను కార్పొరేట్‌ మార్ట్‌లకు దీటుగా మార్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement