రెన్యువల్స్‌లోనూ సిండికేటుగాళ్లు | - | Sakshi
Sakshi News home page

రెన్యువల్స్‌లోనూ సిండికేటుగాళ్లు

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

27 మద్యం షాపులకు నో రెన్యువల్‌

ఖర్చులు తగ్గించుకునే ఎత్తుగడ

కొత్త నోటిఫికేషన్‌ను అడ్డుకునే యత్నం !

భీమవరం: జిల్లాలో మద్యం షాపుల రెన్యువల్‌ ప్రక్రియలోనూ వ్యాపారులు సిండికేట్‌గా మారి, షాపుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. 2024 అక్టోబర్‌ నుంచి 2026 సెప్టెంబర్‌ వరకు (రెండేళ్ల కాలపరిమితికి) లాటరీ ద్వారా మ ద్యం షాపులను కేటాయించారు. ఇలా జిల్లాలోని భీ మవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, ఆకివీడు ఎకై ్సజ్‌ స్టేషన్ల పరిధిలోని మొత్తం 193 షాపుల్లో 175 అన్‌ రిజర్వుడ్‌, 18 కల్లుగీత కార్మికులకు కేటాయించారు. అయితే కమీషన్‌ విషయంలో ప్రభుత్వం కోత పెట్టడం, ప్రజాప్రతినిధులు, ఎకై ్సజ్‌ అధికారులు, సిబ్బందికి భారీగా ము డుపులు ఇవ్వాల్సి రావడంతో నష్టపోతున్నామని వ్యాపారులు అంటున్నారు.

నిబంధనల ఉల్లంఘన

మద్యం వ్యాపారులంతా సిండికేట్‌గా మారి బాటిల్‌పై రూ.20 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అలాగే విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. షాపుల నిర్వహణ వేళల్లో కూడా నిబంధనలు పాటించడం లేదు. వీటిని అధికారులూ పట్టించుకోవడం లేదు.

27 షాపులకు నో రెన్యువల్‌

మద్యం షాపుల లైసెన్సుల గడువు నెలాఖరు వర కూ ఉండగా.. ప్రభుత్వం ఫీజును 38 శాతం పెంచి ఏడాది పాటు లైసెన్స్‌ రెన్యువల్‌కు ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 21లోపు రెన్యువల్‌ చేసుకోవాలని, లేకుంటే ఆయా షాపులను కొత్తవారికి కేటాయిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోజిల్లాలోని 193 షాపులకు 166 షాపులు మాత్రమే రెన్యువల్‌ అయ్యాయని, మిగిలిన 27 షాపులకు రెన్యువల్‌ జరగలేదని ఎకై ్సజ్‌ అధికారులు తెలిపారు. ఎకై ్సజ్‌ స్టేషనవారీగా.. భీమవరంలో 44 షాపులకు గాను 35 (9 ఖాళీ), ఆకివీడులో 25 షాపులకు 18 రె (7 ఖాళీ), తణుకులో 38 షాపులకు 30 రెన్యువల్‌ (8 ఖాళీ), నరసాపురంలో 27 షాపులకు 24 (3 ఖాళీ), తాడేపల్లిగూడెంలో 40 షాపులకు గాను 38 (2 ఖాళీ), పాలకొల్లులో 21 షాపులకు 21 షాపులు రెన్యువల్‌ అయ్యాయి.

ఖర్చులు తగ్గించుకునేందుకే..

రెండేళ్లలో ఎదురైన అనుభవాల దృష్ట్యా రానున్న ఏడాది కాలానికి షాపుల సంఖ్యను తగ్గించుకుని ఖర్చులు నియంత్రించుకోవాలని వ్యాపారులు సిండికేట్‌గా నిర్ణయించారు. ఉదాహరణకు భీమవరం పట్టణంలో ఒక్కో షాపు నిర్వహణకు నెలకు రూ.1.75 లక్షలు కేటాయిస్తారు. దీంతో షాపు అద్దె, సిబ్బంది జీతాలు, విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త నోటిఫికేషన్‌ను అడ్డుకునే కుట్ర

రెన్యువల్‌ కాని షాపులకు ప్రభుత్వం తిరిగి నోటిఫికేషన్‌ జారీ చేస్తే, స్థానిక ప్రజాప్రతినిధుల అండతో దానిని అడ్డుకునేందుకు సిండికేట్‌ కార్యచరణ రూపొందించినట్టు సమాచారం. బయటి వ్యక్తులు ఎవరైనా టెండర్లు వేస్తే, స్థానిక ప్రజాప్రతినిధులతో బెదిరింపులకు పాల్పడి కొత్త షాపులు రాకుండా చూడాలని నిశ్చయించుకున్నారు. మొత్తానికి మద్యం విక్రయాల నుంచి షాపుల నిర్వహణ వరకు తమ హవానే కొనసాగేలా సిండికేట్‌ వ్యూహాలు రచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement