యలమంచిలి: కొంతేరు గ్రామానికి చెందిన సిస్టా జస్వంత్‌శ్రీ వచ్చే ఏడాది అమెరికాలోని హ్యూస్టన్‌లో నాసా సౌకర్యాల్లో జరిగే అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యారని తల్లిదండ్రులు వెంకట సుబ్రహ్మణ్య శ్రీనివాస్, సంగీత తెలిపారు. ఏఎక్స్‌ఏ ఏరోస్పేస్ నిర్వహించే ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయి అంతరిక్ష శిక్షణ, ప్రయోగాత్మక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం జస్వంత్‌కు లభించిందన్నారు. జస్వంత్ ప్రస్తుతం మహారాష్ట్రలోని నాసిక్‌లో శాండిప్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో బీటెక్ రెండో ఏడాది చదువుతూ అంతరిక్ష వ్యవస్థలు, ఆస్ట్రోనాటిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, క్వాంటం మెకానిక్స్‌తో పాటు ఉపగ్రహాల అభివృద్ధి, క్యూబ్‌శాట్ సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, ఆర్‌ఎఫ్ కమ్యూనికేషన్, యాంటెన్నా రూపకల్పన, ఏవియానిక్స్, ప్రొపల్షన్ ప్రాజెక్టులపై పనిచేస్తున్నాడన్నారు. నాసా స్పేస్ యాప్స్ చాలెంజ్‌లో ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్ విద్యాయాప్ అభివృద్ధిలోనూ పాల్గొన్నాడన్నారు. ఇటీవల పోలాండ్‌లో జరిగిన ఏఏటీసీ అనలాగ్ కాలనీ–2ను జస్వంత్ విజయవంతంగా పూర్తి చేశాడన్నారు.


