ప్రయాణించాలంటేనే భయంగా ఉంది | - | Sakshi
Sakshi News home page

ప్రయాణించాలంటేనే భయంగా ఉంది

Sep 22 2026 12:54 AM | Updated on Sep 22 2026 12:54 AM

ప్రయాణించాలంటేనే భయంగా ఉంది క్షేత్రస్థాయిలో పరిశీలించాలి రాత్రి వేళల్లో మరింత ప్రమాదకరం

ఉండి–గణపవరం రోడ్డుపై ప్రయాణించాలంటే తీవ్ర భయమేస్తోంది. రోడ్డుపై చిన్న గుంత ఉంటే తప్పించుకుని వెళ్లొచ్చు. కానీ ఈ రహదారి నిలువునా చీలిపోవడంతో పాటు పలుచోట్ల కుంగిపోయింది. దీంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. – గొంతే హరీష్‌, వాహనదారుడు, పాందువ్వ

రాష్ట్ర రహదారి ఇలా ప్రమాదకరంగా మారినా అధికారులు కన్నెత్తి చూడకపోవడం విచారకరం. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితి తీవ్రతను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలి.

– దానం విద్యాసాగర్‌, న్యాయవాది, పాములపర్రు

పగటిపూట ఎలాగోలా తప్పించుకుని వెళ్లినా, రాత్రి వేళల్లో ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లలో ప్రయాణించడం అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇటీవల ప్రమాదాల సంఖ్య కూడా పెరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. – వర్రే పైడియ్య, మాజీ ఎంపీటీసీ, పాములపర్రు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement