‘బాలసదనం’ ఇంటర్వ్యూలకు 32 మంది హాజరు | - | Sakshi
Sakshi News home page

‘బాలసదనం’ ఇంటర్వ్యూలకు 32 మంది హాజరు

Sep 22 2026 12:54 AM | Updated on Sep 22 2026 12:54 AM

‘బాలసదనం’ ఇంటర్వ్యూలకు 32 మంది హాజరు కాలువలో పడిన బాలుడి మృతి ఎన్‌సీసీతో మంచి అవకాశాలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని దెందులూరు, నూజివీడు బాలసదనాలతో పాటు స్పెషలైజ్డ్‌ అడాప్షన్‌ ఏజెన్సీ (శిశు గృహ)లలో ఖాళీగా ఉన్న పోస్టులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శారద తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. కుక్‌, హెల్పర్‌ కమ్‌ నైట్‌ వాచ్‌ ఉమెన్‌, పార్ట్‌ టైమ్‌ ఎడ్యుకేటర్‌, ఆర్ట్‌–క్రాఫ్ట్‌–మ్యూజిక్‌ టీచర్‌, పార్ట్‌ టైమ్‌ డాక్టర్‌ తదితర 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. 41 మంది అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలిచారు. వీరిలో 32 మంది హాజరవ్వగా, తొమ్మిది మంది గైర్హాజరైనట్లు పీడీ వివరించారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): ప్రమాదవశాత్తూ ఆదివారం మధ్యాహ్నం పట్టణంలోని యాగర్లపల్లి వద్ద గోదావరి కాలువలో పడి గల్లంతైన బాలుడు చుక్క మధు సత్య కౌశిక్‌ మృతదేహం సోమవారం లభ్యమైంది. ఫైర్‌ ఆఫీసర్‌ కొండబాబు ఆధ్వర్యంలో సిబ్బంది లైఫ్‌బోట్‌ సహాయంతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు కై కరం గ్రామం సమీపంలో కాలువలో మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఈ ఘటనతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

నరసాపురం: సాయుధ బలగాల్లో చేరాలనుకునే వారికి నేవల్‌ ఎన్‌సీసీ మంచి అవకాశాలను కల్పిస్తుందని నరసాపురం 7 ఆంధ్రా నేవల్‌ యూనిట్‌ కమాండర్‌ శ్రేయ్‌ దీక్షిత్‌ అన్నారు. సోమవారం నేవల్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో వైఎన్‌ కళాశాలలో క్యాడెట్లకు నేవల్‌ వింగ్‌ ప్రదేశాల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రేయ్‌ దీక్షిత్‌ మాట్లాడుతూ దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను అలవర్చడంలో ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. విద్యార్థులు ఎన్‌సీసీలో చేరాలని సూచించారు. కార్యక్రమంలో వైఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఏవీపీ అప్పారావు, నేవల్‌ యూనిట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement