వీఆర్‌ఏల రణ గర్జన | - | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏల రణ గర్జన

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

న్యూస్‌రీల్‌

మా గోడు పట్టదా?

అరకొర జీతాలతో..

సమస్యలు పరిష్కరించాలి

మంగళవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

భీమవరం: అరకొర జీతాలతో రెవెన్యూ శాఖకు తలలో నాలుకలా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) గోడు పట్టించుకోకపోవడంతో వారం రోజులుగా సమ్మె బాట పట్టారు. ఎన్నికల్లో వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు అధికారం చేపట్టి రెండేళ్లు గడిచిపోయినా ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నారు. ఈనెల 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లాలోని దాదాపు 2,300 మంది వీఆర్‌ఏలు విధులను బహిష్కరించి రెవెన్యూ డివిజన్ల వారీగా వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు.

గ్రామాల్లో వీరే కీలకం

రెవెన్యూశాఖలో పన్నుల వసూళ్లు, భూముల రీసర్వే వంటి కీలకమైన పనులకు వీఆర్‌ఏల కీలకం. ఏ రైతు భూమి ఎక్కడి ఉంది, ఎన్ని ఎకరాల విస్తీర్ణం వంటి అనేక అంశాలను పుస్తకాలు, రికార్డులు చూడనవసరం లేకుండానే చెప్పగల సత్తా వీరిది.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వీఆర్‌ఏలు దాదాపు 2,300 మంది పనిచేస్తుండగా దాదాపు 1,100 ఖాళీలున్నాయని అంచనా. 2019 నుంచి వీఆర్‌ఏల జీతం కేవలం రూ.10,500 మాత్రమే. వీరిలో చాలా మంది డిగ్రీ, పీజీ, బీటెక్‌ వంటి అర్హతలు కలిగిన వారు ఉండడంతో వారితో గ్రామాల్లోని రెవెన్యూ పనులనే గాకుండా తహసీల్దార్‌, ఆర్డీఓ కార్యాలయాల్లో సైతం కంప్యూటర్‌ ఆపరేటర్స్‌, కారు డ్రైవర్స్‌ వంటి పలురకాల పనులకు ఉపయోగించుకుంటున్నారు. వీఆర్‌ఏల సంఘం లెక్కల ప్రకారం డిగ్రీ ఆపై విద్యార్హత కలిగిన వీఆర్‌ఏలు సుమారు 225 మంది ఉండగా, ఇంటర్‌ అర్హత 145 మంది, టెన్త్‌ అర్హత గలవారు సుమారు 185 మంది ఉన్నారు. వీరంతా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా పదోన్నతులు లేవు. చదివిన చదువుకు తగిన ఉద్యోగం పొందలేకపోతున్నామని, అలాగే అరకొర జీతంతో జీవితాలను సాగిస్తున్నామనే ఆందోళన అంతటా ఉంది. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని వీఆర్‌ఏలు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా నాలుగు డిమాండ్లతో వీరు సమ్మె చేపట్టారు.

ఆకలి కేకలు పట్టవా ?

ఈనెల 16 నుంచి వీఆర్‌ఏల సమ్మె

పలు రూపాల్లో నిరసనలు

అయినా పట్టించుకోని ప్రభుత్వం

స్తంభించిన గ్రామ పాలన

ఉమ్మడి జిల్లాలో 2,300 మంది సమ్మెలో..

సమస్యలను పరిష్కరించాలని వారం రోజులుగా సమ్మె చేస్తున్నా మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. రెవెన్యూ శాఖకు గ్రామాల్లో కీలకంగా పనిచేస్తున్న వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తాం.

– మోటూరి మోషే,

వీఆర్‌ఏల సంఘ జిల్లా అధ్యక్షుడు

చాలా ఏళ్లుగా రూ.10,500 జీతంతోనే పనిచేస్తున్నాం. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వణుకు పుట్టిస్తున్నాయి. మా కష్టానికి తగిన జీతం లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. సమస్యలు పరిష్కరించాలి.

– పతివాడ గోపాలకృష్ణ,

వీఆర్‌ఏల సంఘ జిల్లా కార్యదర్శి

జీతాలు పెంచాలని, నామినీ లకు రెగ్యులర్‌ చేయాలని, ప్ర మోషన్స్‌ కల్పించాలనే న్యాయ మైన డిమాండ్లను నెరవేర్చాలి. నెలకు రూ.18 వేలు జీతం, టీఏ, డీఏలు కోరుతున్నాం. ప్రభుత్వం మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

– కురెళ్ల శ్రీనివాసరావు,

వీఆర్‌ఏల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement