నేరాలను అదుపు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి అన్నారు. 8లో u
భీమవరం (ప్రకాశంచౌక్): గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి, సమాజ సంస్కరణకు చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో గురజాడ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురజాడ ఆధునిక తెలుగు సాహిత్యానికి దిశానిర్దేశం చేసిన మహనీయులన్నారు. గురజాడ సాహిత్యాన్ని చదివి, ఆయన ఆశయాలను తెలుసుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. జేసీ కేఆర్ కల్పశ్రీ, డీఆర్వో పి.గ్లోరియా, టూరిజం శాఖ అధికారి ఎ.వెంకట అప్పారావు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
భీమవరం: భీమవరం జిల్లా పోలీసు కార్యాలయంలో మహాకవి గురజాడ అప్పారావు జయంతిని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు సాహితీ దిగ్గజం, మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు విశేషంగా కృషి చేశారన్నారు. గురజాడ సాహిత్య కృషి, సామాజిక స్పృహ, మానవతా దృక్పథాన్ని అంంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారా యణ, మహిళా ఆర్మర్డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) ఈ.ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.


