అర్జీలను వేగంగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలను వేగంగా పరిష్కరించాలి

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

అర్జీలను వేగంగా పరిష్కరించాలి అర్జీల్లో కొన్ని..

● భీమవరం మండలం దిరుసుమర్రు పంచాయతీ పరిధిలోని రామాయణపురంలో డ్రైనేజీ స మస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రా మ మహిళలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

● భీమవరం కేజీఆర్‌ఎల్‌ కళాశాల నుంచి మెయిన్‌ రోడ్డుకు 5 కిలోమీటర్లు మేర లైటింగ్‌ లేక రోడ్లు అధ్వానంగా ఉండటంతో వాహనదారులు ఇ బ్బందులు పడుతున్నారని సుబ్రహ్మణ్యం అనే యువకుడు ఫిర్యాదు చేశారు.

● భీమవరంలో ఆక్రమణలు, ప్రభుత్వాస్పత్రి వద్ద ఫ్లెక్సీలు ప్రమాదకరంగా ఉన్నాయని మొహ్మద్‌ అనే మరో యువకుడు ఫిర్యాదు చేశారు.

భీమవరం(ప్రకాశం చౌక్‌): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా అందిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో ప్రల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం, అలసత్వానికి తావు లేదన్నారు. జేసీ కల్పనశ్రీ, డీఆర్వో గ్లోరియా, డ్వామా పీడీ అప్పారావు, వార్డు సచివాలయ అధికారి దోసిరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అత్తింటి వేధింపులపై ఫిర్యాదు : అత్తింటి వారు వేధిస్తూ తన భర్తకు చెందిన ఇంటిలో ఆశ్రయం లేకుండా చేస్తున్నారని పాలకొల్లు మండలం వెలివెలకు చెందిన గెడ్డం రెబెకా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2012లో తనకు గెడ్డం చంద్రశేఖర్‌తో వివాహం కాగా రెండున్నరేళ్లకు భర్త మృతిచెందాడన్నారు. అప్పటినుంచి అత్తింటి వద్ద ఆదరణ లేకపోవడంతో కుమారుడిని తీసుకుని వెలివర్రులోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నానన్నారు. ప్రస్తుతం తన కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడని, వెలివెలకు వెళ్లి భర్తకు చెందిన ఇంట్లో కుమారుడితో కలిసి ఉండాలని ప్రయత్నించినట్టు చెప్పారు. అయితే అత్తమామలు, భర్త సోదరీమణులు తమను ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, న్యాయం చేయాలని కోరారు.

గళమెత్తిన యానాదులు : జిల్లాలో యానాదుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ యానాది (గిరిజన) సమాఖ్య ఆద్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్‌ నాగరాణికి వినతిపత్రం అందజేశారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం.ఏడుకొండలు మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని యానాదులకు రేషన్‌, ఆధార్‌ కార్డులు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. జిల్లాలో ఆధార్‌ కార్డులు లేని వారు సుమారు 400 మంది వరకు ఉన్నారని ప్రత్యేక ఆధార్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి కార్డులు మంజూరు చేయాలని కోరారు. అలాగే యానాదులకు ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.

కలెక్టర్‌ నాగరాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement