భీమవరం (ప్రకాశంచౌక్): పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సరైన పునాది పోషకాహారం, ప్రేమతో కూడిన సంరక్షణేనని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన స్టాల్‌ను ఆమె పరిశీలించారు. వచ్చేనెల 8 వరకు జిల్లాలో జాతీయ పోషకాహార మహోత్సవ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి డి.శ్రీలక్ష్మి, జిల్లా కో–ఆర్డినేటర్ పి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): పాలకొల్లు బీఆర్‌ఆర్ అండ్ జీకేఆర్ చాంబర్ డిగ్రీ కాలేజీలో ఈనెల 26న మె గా ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు జేసీ కల్ప శ్రీ తెలిపారు. సోమవారం అధికారులతో కలిసి పో స్టర్లను ఆవిష్కరించారు. సుమారు 20 కంపెనీల్లో 1,500కు పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నా రు. 18–35 ఏళ్ల వయసున్న అభ్యర్థులు అర్హుల న్నారు. వివరాలకు మనోజ్ 63049 22617, నాగేంద్ర 9502024765, ప్రసన్న 70138 96277ను సంప్రదించవచ్చన్నారు. డీఆర్వో పి.గ్లోరియా, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్ పాల్గొన్నారు.


