రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన ద్వారకాతిరుమల గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ప్రధాన రహదారుల వెంట డ్రెయినేజీలు మురుగుతో నిండిపోయి దుర్వాసన వస్తుండగా, పలు ప్రాంతాల్లో మూడు నెలలుగా శుభ్రపరిచే పనులు జరగలేదని స్థానికులు చెబుతున్నారు. మురుగునీరు నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగింది. మరోవైపు చెత్తకుండీలు లేక రోడ్ల పక్కన చెత్త పేరుకుపోతోంది. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రంలో డ్రెయినేజీల శుభ్రత, చెత్త సేకరణ, నిరంతర పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


