పెనుమంట్ర: మండల పరిధిలోని గరువు, నత్తారామేశ్వరం గ్రామాల్లో ఇటీవల జరిగిన రెండు వేర్వేరు చోరీలకు సంబంధించి ఇద్దరు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రెండు కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై కె.స్వామి శుక్రవారం తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పెనుగొండ మండలం చినమల్లం గ్రామానికి చెందిన గెద్దాడ సురేంద్ర అలియాస్ సూర్య, తణుకుకి చెందిన చొధవరపు సాయి అలియాస్ దూల సాయిను అరెస్ట్ చేశామన్నారు. ద్వారకాతిరుమల, రావులపాలెం, పోడూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో వీరిపై మరో చోరీ కేసులు నమోదయ్యాయని, తమ విచారణలో తేలిందన్నారు.
2 కిలోల వెండ్రి సామగ్రి స్వాధీనం


