ఏపీఎస్‌ఎఫ్‌ఏతో ఉద్యాన వర్సిటీ ఎంఓయూ | - | Sakshi
Sakshi News home page

ఏపీఎస్‌ఎఫ్‌ఏతో ఉద్యాన వర్సిటీ ఎంఓయూ

Sep 8 2026 12:53 AM | Updated on Sep 8 2026 12:53 AM

తాడేపల్లిగూడెం: అటవీశాఖ, ఉద్యాన రంగం, పర్యావరణ పరిరక్షణతో పాటు అనుబంధ రంగాల్లో సాంకేతిక సహకారం కోసం రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫారెస్ట్‌ అకాడమీ (ఏపీఎస్‌ఎఫ్‌ఏ)తో డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ అడవల పరిరక్షణ వల్ల పర్యావరణ సమతుల్యత, భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఏపీఎస్‌ఎఫ్‌ఏ డైరెక్టర్‌ బి. విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు ప్రారంభించినందున అటవీశాఖతో విద్యా శిక్షణను బలోపేతం చేయడంతో పాటు, గిరిజన రైతులకు ఉద్యాన, అగ్రోఫారెస్ట్రీ సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామన్నారు. ఈ ఒప్పందం ద్వారా గిరిజనుల జీవనోపాధికి అవసరమైన శిక్షణలు, వర్క్‌షాపులు, సెమినార్లు నిర్వహించడంతో పాటు సంయుక్త పరిశోధనలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఎం. మాధవి, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు. అనంతరం విజయ్‌కుమార్‌ కేవీకే వాణిజ్య ఉత్పత్తుల స్టాల్‌ను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement