ప్రస్తుతం ఆర్థిక మాంధ్యం వచ్చిందా అనే పరిస్థితి కనిపిస్తోంది. చాలా వ్యాపారాలు బోణీ కాకుండానే రాత్రి దు కాణం తాళం వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపారం లేక తెచ్చిన సరుకుకు డబ్బు చెల్లించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి. అయితే డబ్బు తీర్చలేని పరిస్థితుల్లో అప్పు ఇచ్చిన వారికి ముఖం చూపలేక కొందరు వ్యాపారులు ఆత్మహత్యలకు పా ల్పడుతున్నారు. చాలామంది వ్యాపారులు రా త్రికి రాత్రే ఊర్ల నుంచి పారిపోతున్నారు. త ణుకులో చాలా దుకాణాలు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజల వద్ద డబ్బు చలామణి అయ్యేది దీంతో వ్యాపారాలు బాగుండేవి.
– జల్లూరి జగదీష్, రెడీమేడ్ వస్త్ర వ్యాపారి, తణుకు
ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారాలు సాగక అప్పుల ఊబిలో చిక్కుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెడుతున్నాయి. వ్యాపారాలు మందగించడం, కొనుగోలుశక్తి పడిపోవడం, కుటుంబ పోషణ, పిల్లల చదువుల భారం పెరగడంతో కొందరు క్షణికావేశంలో, మరికొందరు కుటుంబంతో సహా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరువు కోసం కొందరు వ్యాపారులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. కొందరు రాత్రికి రాత్రి దుకాణాలు మూసి ఇళ్లకు తాళాలు వేసి పలాయనం చిత్తగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గత రెండు నెలల్లో 20కి పైగా ఆత్మహత్యల ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
తణుకు అర్బన్: అధిక శాతం మధ్య తరగతి వర్గాలు నిర్వహించే చిరు వ్యాపారాలు ఒడిదుడుకులతో సాగుతున్నాయి. ఓ పక్క వ్యాపారం తగ్గడంతో పాటు మరోపక్క మార్కెట్‌లో కొనుగోలు శక్తి మందగించడంతో వ్యాపారాల నిర్వహణ కష్టమై అధిక వడ్డీలకు అప్పులబాట పట్టాల్సి వస్తోంది. నెలవారీ, టెండరింగ్ పద్ధతిలో రోజువారీ వడ్డీలు కట్టడం కష్టతరమవుతోంది. రాబడి అంతంతమాత్రంగా ఉండటం ఖర్చులు, వడ్డీల భారం అధికమవడంతో బ తుకు బండి లాగలేక, ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు బలవన్మరణాల బాట పడుతున్నారు.
అప్పులు తీర్చలేక..
తణుకు ప్రాంతంలో ఇటీవల జరిగిన రెండు ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయికృష్ణ, శిరీష దంపతులు చించినాడలోని గోదావరిలోకి దూకి మరణించిన ఘటనను మరువకుండానే తాజాగా తణుకుకు చెందిన పాల వ్యాపారి నంబూరి శ్రీనివాస్ తన కుటుంబంతో సహా అదే గోదావరిలో దూకి విగతజీవులుగా మిగలడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు ఘటనల్లోను ఆర్థిక ఇబ్బందులు, అప్పులపాలవ్వడం కారణంగా కనిపిస్తోంది.
గతంలో జోరుగా వ్యాపారాలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు పేద, మధ్యతరగతి వర్గాలకు సుమారు వందకు పైగా సంక్షేమ పథకాలు అందించారు. దీంతో మా ర్కెట్‌లో కొనుగోలు శక్తి బాగుండేదని వ్యాపారులు అంటున్నారు. ప్రభుత్వ లబ్ధి నేరుగా పేదల ఖా తాలకు బదిలీ కావడంతో వ్యాపారాలు బాగా జరిగేవని, ముఖ్యంగా పండుగల సమయాల్లో పథకాలు అందించడంతో చిరు వ్యాపారులకు మేలు జరిగేదని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని రోజురోజుకీ వ్యాపారాలు ఖాళీ అయిపోతున్నాయని ఇప్పటికే టూలెట్ బోర్డులు పెడుతున్న దుకాణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని అంటున్నారు. అప్పుల బాధలతో మరిన్ని కుటుంబాలు రోడ్డున పడనున్నాయని వ్యాపారులు ఘొల్లుమంటున్నారు.
అప్పుల ఊబిలో మధ్య తరగతి
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు
పరువు కోసం బలవన్మరణాలు
అయితే ఉరి.. లేదంటే గోదావరి
ఆందోళన కలిగిస్తున్న వైనం
మార్కెట్‌లో తగ్గిన కొనుగోలు శక్తి


