ఆస్పత్రికి వెళ్లి వస్తూ..
ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి వైద్యానికి వెళ్లి వస్తూ మార్గమధ్యంలో కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు మృత్యువాత పడగా తండ్రి గాయపడ్డారు. 8లో u
వీరవాసరం: డీఎస్సీ అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని శాసనమండలి సభ్యు డు, వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కవు రు శ్రీనివాస్ డిమాండ్ చేశా రు. మండలంలోని నవుడూ రు జంక్షన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దగా డీఎస్సీ ద్వారా నియమించిన నకిలీ ఉపాధ్యాయులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నకిలీ ఉపాధ్యాయుల వల్ల విద్యార్థులకు చదువు రాకపోగా, సంవత్సరాల పాటు భవిష్యత్తు నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థికి అవసరమని, విద్యార్థుల భవిష్యత్తు మనందరి బాధ్యత అన్నారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వసించి విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారన్నారు. నాడు–నేడుతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, అభివృద్ధి పథంలో పాఠశాలలను ముందుకు నడిపారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంలో స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమంగా ఉపాధ్యాయులను నియమించి, నిజమైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేయడం దారుణం అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగు తున్న అవినీతి, అక్రమాలను ప్రజలంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని శ్రీనివాస్ అన్నారు.


