న్యూస్‌రీల్
భారీ గుంతలతో..
అర్జీలపై అలసత్వం తగదు
మంగళవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: రహదారుల అభివృద్ధి పేరిట కూటమి ప్రభుత్వం కనికట్టు చేస్తోంది. రోడ్లకు కనీస మరమ్మతులు చేసేందుకు ఆపసోపాలు పడుతోంది. రూ.కోట్లు వెచ్చించి రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని పాలకులు చెబుతుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది. నాసిరకం పనులతో మరమ్మతులు మూన్నాళ్ల ముచ్చటవుతుండగా ప్రజాధనం పక్కదారి పడుతోంది.
జిల్లాలో 1,568 కి.మీ రోడ్డు
జిల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలో స్టేట్ హైవే, మేజర్ డి స్ట్రిక్ట్ రోడ్లు 1,568 కిలోమీటర్లు పొడవునా విస్తరించి ఉన్నాయి. రోడ్లను అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి మొదటి ఏడాది ప్యాచ్ వర్క్‌లతో సరిపెట్టింది. రూ.42.57 కోట్లతో ప్యాచ్ వర్కులు, అత్యవసర మరమత్తులు చేపట్టారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు చూస్తారంటూ పండుగల మూడు రోజులు మన్నితే చాలన్నట్టు కొన్నిచోట్ల ప్రమాణాలు పాటించకుండా నాసిరకంగా పనులు చేయగా, మరికొన్నిచోట్ల గుంతల్లో మెటల్, చిప్స్ వేసి తారు వేయకుండా వదిలేయడంతో కొద్ది రోజులకే రాళ్లుపైకి లేయిపోయి పరిస్థితి మొదటికొచ్చింది.
రెండో ఏడాదీ అదే తీరు
గతేడాది నాబార్డ్, ప్లాన్, ఎస్‌సీసీ వర్క్స్, అడిషనల్ ఫండ్స్ రూ.141 కోట్లతో జిల్లాలో మార్టేరు–పక్కిలంక, పాలకొల్లు–దొడ్డిపట్ల, పెనుమంట్ర–వీరవాసరం, పాలకొల్లు–ఆచంట, దువ్వ–ఆరుళ్ల, ఉద్దలపాలెం–దువ్వ, నరసాపురం–మేడపాడు, తాడేపల్లిగూడెంలోని విజయవాడ–విశాఖ తదితర రోడ్లు అభివృద్ధికి సంబంధించి 37 వర్క్‌లు మంజూరు చేసింది. యాన్యువల్ మెయింటినెన్స్ నిధులు రూ.3 కోట్లతో 650 కిలోమీటర్లు మేర ప్యాచ్ వర్క్‌లు చేపట్టారు. టెండర్ల జాప్యంతో చాలాచోట్ల ఆలస్యంగా పనులు మొదలయ్యాయి. సాధారణంగా భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటుంటాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాల జాడే లేకున్నా ఇటీవల వేసిన రోడ్లు అప్పుడే గుంతలమయం అవుతు న్నాయి. దీంతో గోతులను పూడ్చేందుకు మళ్లీ ప్యాచ్ వర్కులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి, పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. రూ.కోట్లు కుమ్మరించినా నాసిరకంగా పనులు చేయడంతో అప్పుడే రోడ్లు దెబ్బతింటున్నాయని వాహనచోదకులు అంటున్నారు. సమస్య పరిష్కారం అయ్యిందనుకునేలోపే పరిస్థితి మళ్లీ మొదటికొస్తోందంటున్నారు.
పాలకోడేరు–నౌడూరు రోడ్డులోని ఈ చిత్రాన్ని చూశారా? ఇటీవల రోడ్డుకు కొంత మేర ప్యాచ్ వర్కులు, మరికొంత మేర బీటీగా నిర్మాణం చేశారు. కొన్ని నెలలైనా మన్నకుండానే ఎక్కడికక్కడ ఇదిగో ఇలా గోతులు పడుతోంది. వాటిని మళ్లీ ప్యాచ్‌లతో పూడుస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే రోడ్డు మరమ్మతుల నాణ్యత బండారం బయటపడుతుందని ప్రయాణికులు అంటున్నారు.
రోడ్డుకు ప్యాచ్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రాన్ని గమనించారా? వీరవాసరం–బ్రాహ్మణచెరువు రోడ్డు దుస్థితి ఇది. గోతులమయంగా ఉండే ఈ రోడ్డును రెండు నెలల క్రితమే బీటీ రోడ్డుగా అభివృద్ధి చేశారు. కొద్ది రోజుల్లోనే రోడ్డులోని నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. భారీవర్షాల జాడలేకపోయినా గుంతలు పడుతున్నాయి. వాటిని కప్పిపుచ్చేందుకు ఇదిగో ఇలా మళ్లీ ప్యాచ్ వర్కులు చేస్తున్నారు.
రోడ్లు గుల్ల.. నాణ్యత డొల్ల
జిల్లాలో నాసిరకంగా రోడ్ల మరమ్మతులు
ప్యాచ్ వర్కులకే ప్యాచ్‌లు
మున్నాళ్ల ముచ్చటగా రోడ్ల అభివృద్ధి
ప్రయాణికులకు తప్పనిపాట్లు
ఆకివీడులోని అయి భీమవరం వెళ్లే రహదారి ముఖద్వారంలో గుంతలుగా ఉన్న ప్రాంతాన్ని పూడ్చి ప్యాచ్ వర్క్ చేయడంలో ఆర్‌అండ్‌బీ అధికారులు తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. ఇటీవల ప్యాచ్ వర్క్ చేసిన ఈ ప్రాంతం మళ్లీ అధ్వానంగా మారింది. వాహనచోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చిరుజల్లులకే గుంతలు చెరువులను తలపిస్తున్నాయి.


