● ఈనెల 5న తణుకుకు చెందిన పాల వ్యాపారి నంబూరి శ్రీనివాస్ ఆర్థిక సమస్యలతో భార్య పద్మిని, కుమారుడు ఈశ్వర్, కుమార్తె నిత్యశ్రీతో కలిసి చించినాడ బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకగా పద్మినిని జాలర్లు రక్షించగా.. మిగిలిన ముగ్గురూ విగత జీవులయ్యారు. పద్మిని చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు.
● గతనెల 28న తణుకు మండలం వేల్పూరుకి చెందిన రెడీమేడ్ వస్త్ర వ్యాపారి దొడ్డా సాయికృష్ణ వ్యాపారపరంగా వచ్చిన నష్టాలతో అప్పులపాలై భార్య శిరీషతో కలిసి చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి మృతదేహాలుగా మిగిలారు.
● గతనెల 28న తణుకుకు చెందిన యువతి గురవాని అనుదీప్తి ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. తల్లితండ్రులు లేకపోవడంతో చిన్నాన్న వద్ద్ద ఉంది.
● గతనెల 11న తణుకుకు చెందిన ఇంటర్ విద్యార్థి సింహాద్రి ఆదిత్య ఉరి వేసుకుని మృతిచెందాడు.
● జూలై 10న తణుకుకు చెందిన బాలిక గాలిదేవర శ్రీయామిని లాస్య తల్లి చనిపోగా తండ్రి ఆదరణకు నోచుకోక నానమ్మ వద్ద ఉంటూ కుటుంబ ఇబ్బందులతో గోస్తనీ కాలువలోకి దూకి చనిపోయింది.
● జూలై 17న తణుకుకు చెందిన నాయుడు బుక్‌స్టాల్ యజమాని పతివాడ పార్వతీనాయుడు అప్పులపాలై తణుకు రాష్ట్రపతి రోడ్డులోని తన దుకాణంలోనే ఉరివేసుకుని మృతిచెందారు.


