బ్యాగోతం బట్టబయలు | - | Sakshi
Sakshi News home page

బ్యాగోతం బట్టబయలు

Aug 21 2026 7:39 AM | Updated on Aug 21 2026 7:39 AM

న్యూస్‌రీల్‌

మూన్నాళ్ల ముచ్చటగా..

చిరిగిపోతే కొత్తవి ఇస్తాం

చిరిగిన బ్యాగులు.. అరకొర పుస్తకాలు.. కాళ్లకు చెప్పులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ బడుల్లో విద్యార్థి మిత్ర కిట్లను పూర్తిస్థాయిలో అందించలేదు. అలాగే ఇచ్చిన సామగ్రి నాణ్యత తీసికట్టుగా ఉందని తల్లిదండ్రులు అంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులకు అందించిన సామగ్రి నాణ్యతపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌.

శురకవారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2026

భీమవరం: మెగా డీఎస్సీ నిర్వహణలో విమర్శలు ఎదుర్కొన్న కూటమి ప్రభుత్వం విద్యార్థి మిత్ర పథ కంలో భాగంగా విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠశాల సామగ్రి నాణ్యతా లోపంతో మరో వివాదంలో చిక్కుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లో కేష్‌ నేతృత్వంలో విద్యావ్యాప్తి వేగవంతంగా జరుగుతోందని ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు ప్రచారం చేసుకుంటునా, ఈ విద్యాసంవత్సరంలో జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసిన స్కూల్‌ బ్యాగులు, బెల్టులు, షూలలో తీవ్ర నాణ్యతా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు.

గత ప్రభుత్వంలో పారదర్శకంగా..

గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పాఠశాలలు తెరిచిన మొదటి రోజే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌తో పాటు స్కూల్‌ బ్యాగ్‌, యూనిఫాం, షూస్‌, బెల్టులను పంపిణీ చేసేవారు. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఇరాన్‌ యుద్ధాన్ని సాకుగా చూపి బడులు తెరిచిన రెండు నెలల తర్వాత విద్యార్థి మిత్ర కిట్లను అందించింది. పారదర్శకంగా పథకాన్ని అమలు చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. పంపిణీ చేసిన రెండు, మూడు నెలలకే బ్యాగులు చిరిగిపోతుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరిగిన బ్యాగులకు కుట్లు వేసుకుని బడికి వస్తున్న విద్యార్థుల పరిస్థితిని చూసి ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

జిల్లాలో 1,399 ప్రభుత్వ పాఠశాలలు

జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, నరసాపురం మున్సిపాలిటీలు, ఆకివీడు నగర పంచాయతీతో పాటు 20 మండలాల పరిధిలో దాదాపు 1,399 ప్రభుత్వ పాఠశాలలు ఉ న్నాయి. వీటిలో సుమారు 90 వేల మంది వి ద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల అవసరాల కోసం ఈ ఏడాది 86,258 స్కూల్‌ బ్యాగులు, యూనిఫాంలు, షూలు, 4,77,462 పాఠ్యపుస్తకాలు, 56,315 బెల్టులు, 9,285 డిక్షనరీలు కా వాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. అయితే మొదటి విడతలో నోట్‌ పుస్తకాలు, డిక్షనరీలు మినహా మిగిలిన వస్తువులు పాఠశాలలకు పూర్తిస్థాయిలో చేరలేదు. కొత్తగా చేరిన విద్యార్థులకు రెండో విడతలో విద్యాసామాగ్రి వస్తుందని అధికారులు తెలిపినా, నేటికీ పలు పాఠశాలల్లో పూర్తిస్థాయిలో అందలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంపిణీ చేసిన వస్తువులు తీవ్ర నాణ్యతా లోపంతో ఉండటం వల్లే తక్కువ వ్యవధిలోనే పాడవుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పుస్తకాల సంఖ్య ఎక్కువగా ఉండటం, బ్యాగుల పరిమాణం చిన్నదిగా ఉండటంతో అవి త్వరగా చిరిగిపోతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. షూస్‌ సైజులు సరిగా లేకపోవడం (పెద్దవిగా ఉండటం) వల్ల కొందరు విద్యార్థులు షూస్‌ వేసుకోలేక చెప్పులతోనే పాఠశాలలకు వస్తున్నారు. చిరిగిన బ్యాగులకు కుట్లు వేయించి వాడలేక, కొత్తవి కొనలేక నిరుపేద తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, పేద విద్యార్థులకు అందజేసే విద్యార్థి మిత్ర సామగ్రిలో పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరుతున్నారు.

కిట్టు.. నాణ్యత తీసికట్టు

నాణ్యతలేని విద్యార్థి మిత్ర సామగ్రి

మూడు నెలలకే చిరిగిపోతున్న స్కూల్‌ బ్యాగులు

కొత్త విద్యార్థులకు ఇప్పటికీ అందని కిట్లు

జిల్లాలో 1,399 పాఠశాలలు

85,283 బ్యాగుల పంపిణీ

ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఇచ్చిన స్కూల్‌ బ్యాగ్స్‌ చిరిగిపోయినట్టు మా దృష్టికి రాలేదు. నాణ్యమైన బ్యాగ్స్‌, యూనిఫామ్‌, షూస్‌ వంటివి పంపిణీ చేశాం, ఎక్కడైనా బ్యాగ్స్‌ చిరిగిపోయినట్లు ఎంఈఓల దృష్టికి తీసుకువెళితే వాటిని పరిశీలించి కొత్త బ్యాగులు ఇస్తాం.

– పి.శ్యామ్‌సుందర్‌, సమగ్రశిక్షా అడినల్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌, భీమవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement