తణుకు అర్బన్: కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27న భీమవరం ఎకై ్సజ్ కార్యాలయం ముట్టడించనున్నట్టు ఏపీ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి తెలిపారు. గురువారం స్థానిక సీ ఐటీయూ కార్యాలయంలో మామిడిశెట్టి నాగభూషణం అధ్యక్షతన తణుకు డివిజన్ గీత కార్మిక సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని లిక్కరాంధ్రప్రదేశ్‌గా మారు స్తోందని మండిపడ్డారు. మద్యం ఆదాయాన్ని పెంచుకోవడానికి రాష్ట్రంలో 3,636 బ్రాందీ షాపులను ఏర్పాటుచేసి వాటికి అనుబంధంగా గ్రామాల్లో లక్ష వరకు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. మద్యం ఏరులై పారుతుండటంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు, నష్టపరిహారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘ డివిజన్ కార్యదర్శి కాసాని శ్రీనివాస్, కట్టా వెంకటేశ్వరరావు కడలి బాలాజీ, కాకతల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని గురువారం జిల్లా దేవదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు సమక్షంలో లెక్కించారు. 17 రోజులకు రూ.1,65,14,515 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. కానుకల రూపంలో 116 గ్రాముల బంగారం, 2.185 కిలోల వెండితో పాటు అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అలాగే లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2,000, రూ.500 ల నోట్ల ద్వారా రూ.3 వేలు లభించాయన్నారు. సగటున రోజుకి రూ.9,71,442 ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు.
ముసునూరు: దేశ ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈనెల 24న ముసునూరులో పర్యటించనున్నారని, ఈ మేరకు పటిష్ట ఏర్పాట్లు చే యాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఏ లూరు ఐజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్, జేసీ అభిషేక్ గౌడతో కలిసి గురువారం హెలీప్యాడ్, బహిరంగ సభాస్థలి, వాహనాల క్వానాయ్ రూట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో ఆమె సమీక్షించారు. ముసునూ రులో గోర్మెట్ పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో నూతన పాప్ కార్న్‌సీడ్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి పాల్గొంటారన్నారు. సీఎం చంద్రబాబు, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ హాజరయ్యే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం గోర్మెట్ పాప్ కార్ని కా ఫ్యాక్టరీలో పలు విభాగాలను ఆమె పరిశీలించారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఏలూరు టౌన్: ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడ) పిలుపుతో ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో జూడలు విధులను బహిష్కరించి చేపట్టిన సమ్మె గురువారం కొనసాగింది. జూడాల సమ్మెతో ప్రజలు మరింత అసౌకర్యానికి గురవుతున్నారు. జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంచాలనీ, కష్టానికి తగిన ఫలితాన్ని ఆశించటం తమ హక్కుగా భావిస్తున్నామని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా ఏపీ జూడతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఎంఎస్సీ, పీహెచ్‌డీ పోస్టుల భర్తీలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనీ, వైద్యుల పోస్టుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లుగా ఉండాలని డిమాండ్ చేశారు. ఏపీ జూడ నుంచి సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్‌ను తప్పించటం సరైన విధానం కాదని అన్నారు.


