న్యూస్‌రీల్
డీఎస్సీలో మోసపోయాను
సీబీఐ విచారణ జరపాలి
ఆక్వారంగంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తెచ్చి సమస్యలను పరిష్కరించేందుకు ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేస్తోంది. 8లో u
అభివృద్ధి పనుల ముసుగులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో రామన్నగూడెం రావుల చెరువు వివాదాలకు నిలయంగా మారింది. 8లో u
ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. డీఎస్సీ అక్రమాలపై విచారణ, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం, ఆచంట, పాలకొల్లు, భీమవరం, తణుకు ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
తాడేపల్లిగూడెంలో..
డీఎస్సీలో దొడ్డిదారిన జరిగిన నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 7 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కన్వీనర్ వడ్డి రఘురాం డిమాండ్ చేశారు. నీట్ అక్రమాలపై కేంద్రమంత్రి రాజీనామా చేసినట్లుగానే, డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.
ఆచంటలో..
మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ఆచంటలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఆచంట, పెనుమంట్ర, పోడూరు, పెనుగొండ మండలాల నుంచి వందలాదిగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. యువతకు అండగా ఉంటామన్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు. డీఎస్సీ అక్రమాలపై తక్షణ సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
భీమవరంలో..
మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు విమర్శించారు. నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు నేతృత్వంలో భీమవరంలో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక సర్టిఫికెట్లు రాక అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలకు లోకేష్ బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తణుకులో..
ఎన్నికల సమయంలో డీఎస్సీ కోసం మొదటి సంతకం చేస్తామన్న కూటమి నేతలు అభ్యర్థులను దగా చేశారని నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల విమర్శించారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో ఆమె మాట్లాడుతూ.. మెరిట్ అభ్యర్థులను మోసం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పాలకొల్లులో..
చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం డీఎస్సీని అవినీతి, అక్రమాలకు నిలయంగా మార్చి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని వైఎస్సార్‌సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద మూడో రోజూ రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణం విడదల చేయాలని డిమాండ్ చేశారు.
లోకేష్ రాజీనామా చేయాలి
నేను ఎంఏ, బీఈడీ చదివాను. గత డీఎస్సీలో కష్టపడి చదవడంతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి కాల్ లెటర్ కూడా వచ్చింది. ఉద్యోగం ఇచ్చే సమయానికి మెరిట్ జాబితాలో నా పేరు లేదు. న్యాయం కోసం మంత్రి లోకేష్‌తో పాటు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. నాలాంటి ఎంతోమంది మోసపోయిన అభ్యర్థులకు న్యాయం జరగాలంటే డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలి. – తగరం నాగరాజు, లింగపాలెం
నేను బీఎస్సీ, బీఈడీ చదివాను. డీఎస్సీలో ఎలాంటి అర్హత లేని వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు కట్టబెట్టడం వల్ల మాలాంటి మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ అక్రమాలకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. సీబీఐ విచారణ జరిపించి మోసపోయిన నిజమైన అభ్యర్థులను ఆదుకోవాలి.
– వెలగలేటి వెంకటేశ్వరరావు, కొత్తూరు, కామవరపుకోట మండలం
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎప్పుడిస్తారు?
జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు


