
దళితుల జోలికొస్తే సహించేది లేదు
వైభవంగా పవిత్రారోహణ
ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరిపై కొలువైన లక్ష్మీనరసింహ స్వామి దివ్య పవిత్రోత్సవాల్లో బుధవారం పవిత్రారోహణ వేడుక కన్నులపండువగా జరిగింది. 8లో u
ఉండి: వాండ్రం దళితపేట డ్రెయిన్‌కు ఆనుకుని ఉన్న ఇళ్లు పడగొట్టాలంటూ స్థానికంగా వున్న కొందరు ఓ భారీ పొక్లెయినర్‌ను తీసుకురావడంతో ఒక్కసారిగా దళితులు భగ్గుమన్నారు. గ్రామంలోని దళితులు బుధవారం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు రైతుల ముసుగులో అధికారులను అడ్డుపెట్టుకుని కూటమి నాయకుల సహకారంతో మా ఇళ్ళను పడగొట్టేందుకు కక్ష కట్టారని ఆరోపించారు. గ్రామంలో అధికారులు చెబుతున్న డ్రెయిన్ ప్రభుత్వ లెక్కల్లో లేదన్నారు. కొందరు వ్యక్తుల కోసం డ్రెయిన్‌ను అడ్డుపెట్టుకుని అక్కడ రోడ్డు వేయాలని చూస్తున్నారన్నారు. కొందరు స్థానిక ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం ఇచ్చి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇక నుంచి ప్రతీరోజు ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వాండ్రం గ్రామంలో దళితులకు చెందిన ఇళ్ళు కూల్చేస్తామని కొందరు అధికారులను కూడా మోసం చేస్తున్నారని దళిత మహిళలు కన్నీరుమున్నీరయ్యారు. రూపాయి రూపాయి కూడగట్టుకుని కట్టుకున్న మా ఇళ్లను మా ప్రాణాలు ఇచ్చయినా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మత్తి రాజ్‌కుమార్, మాజీ సర్పంచ్ యాడంగి యేసు, కోనాల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.