
ఆక్వా రైతులను ఆదుకోవాలి
ఉండి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రైతులను ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయ రైతు సంఘ మాజీ అధ్యక్షుడు బి.బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉండి ఏఎంసీ ప్రాంగణంలో రైతు సంఘ జిల్లా నాయకుడు జీను ఆదినారాయణ ఆధ్వర్యంలో ఆక్వా రైతు జిల్లా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ సంఘ అధ్యక్షుడు వి.కృష్ణయ్య, కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎ.హరిబాబు, జిల్లా కార్యదర్శి ఆకుల హరే రామ్ మాట్లాడుతూ దేశంలో ఆక్వా సాగు వి స్తరించాలని పిలుపునిచ్చిన ప్రభుత్వాలు ఇప్పు డు ఆక్వా రైతు కష్టాల్లో ఉంటే ఎందుకు భరోసా ఇవ్వడం లేదన్నారు. రైతులను ఆదుకోకుంటే ఆక్వా రంగం మరింత కుదేలవుతుందన్నారు. రైతుల భాగస్వామ్యం లేకుండా అమరావతిలో అడ్వయిజరీ కమిటీని వేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఆక్వా రైతులను వెంటనే ఆదుకోకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చెరుకువాడ సర్పంచ్ కొండవేటి సాంబశివరావు, నాయకులు ధనికొండ శ్రీనివాస్, మంగిన శ్రీహరి, ఆక్వా రైతులు పాల్గొన్నారు.