
అంగన్‌వాడీల నిరసన
ఆకివీడు/భీమవరం: అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక వైఎస్సార్ సెంటర్‌లో మానవహారం చేపట్టారు. సీఐటీయూ నాయకులు బి.రాంబాబు మాట్లాడుతూ పాత ఫోన్లతో తీవ్ర ఇబ్బంది పడుతున్న అంగన్‌వాడీలకు కొత్త ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని, కొత్తగా ప్రభుత్వం తీసుకువచ్చిన ఫేస్ యాప్‌ను రద్దుచేయాలన్నారు. అంగన్‌వాడీ సంఘ నాయకురాలు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
భీమవరంలో..
భీమవరం: అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి స్కేలు జీతం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు డిమాండ్ చేశారు. భీమవరంలో నిరసన ధర్నా చేపట్టారు. సీఐటీయూ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనాలు అమలు చేయాలని, పని ఒత్తిడి తగ్గించాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని నినాదాలు చేశారు. అంగన్‌వాడీ సంఘ నాయకురాలు మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ప్రింట్‌అవుట్‌లను 25 వరకు స్వీకరిస్తామన్నారు.