ఏలూరు టౌన్: ఆపరేషన్ ట్రేస్‌లో భాగంగా ఒక బాలుడ్ని బంధువులకు అప్పగించినట్లు ఏలూరు మహిళా స్టేషన్ సీఐ, శక్తి టీమ్ ఇన్‌చార్జి ఎం.సుబ్బారావు తెలిపారు. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో జిల్లాలో ఈనెల 1 నుంచీ 31తేదీ వరకూ ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమంలో బాలల తల్లిదండ్రులు, బంధువులను గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా ఏలూరులోని చిల్డ్రన్ హోమ్‌లో గత 8 ఏళ్లుగా ఉంటున్న నాగరాజు అనే బాలుడి బంధువులను గుర్తించామన్నారు.
బాలుడి మేనత్త బుధవారం ఏలూరు నగరంలోని చిల్డ్రన్ హోమ్‌కు చేరుకుని బాలుడ్ని గుర్తించి సంతోషాన్ని వ్యక్తం చేసింది. చదువు పూర్తి చేసిన అనంతరం ఆమెతో పంపేందుకు అధికారులు నిర్ణయించారు. కార్యక్రమంలో శక్తిటీమ్ కానిస్టేబుల్ సుజాత, కానిస్టేబుల్ గోపాలకృష్ణ, చిల్డ్రన్ హోమ్ సిబ్బంది ఉన్నారు.
అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు
ఆకివీడు: అధనపు కట్నం వేధింపులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ సత్యనారాయణ చెప్పారు. స్థానిక గుమ్ములూరు సెంటర్‌లో నివసిస్తున్న సత్యవేణికి హైదరాబాద్‌కు చెందిన కన్నా నరేష్‌తో 2023లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అదనపు కట్నం కోసం భర్త నరేష్, అత్తమామలు, ఆడపడుచు, చిన్నమామలు వేధిస్తున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆపరేషన్ ట్రేస్‌లో బంధువుల చెంతకు బాలుడు