
రన్నరప్‌గా బాలుర బాస్కెట్‌బాల్ జట్టు
ఏలూరు రూరల్: రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలుర జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. ఈ నెల 14వ తేదీ నుంచి 17 వరకూ పిఠాపురంలో ఓబీసీ హైస్కూల్ గ్రౌండ్‌లో 10వ రాష్ట్రస్థాయి బాలబాలికల జూనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. లీగ్ దశలో జిల్లా బాలురు జట్టు శ్రీకాకుళం జట్టుపై 25–08, విజయనగరంపై 31–11, కర్నూల్‌పై 58–45, గుంటూరుపై 47–31 స్కోర్ తేడాతో గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. ఆదివారం వర్షం కురవడంతో మ్యాచ్‌లు జరగలేదు. దీంతో నిర్వాహకులు పూర్తిస్థాయి మ్యాచ్‌కు బదులుగా 5 ఫ్రీ త్రో బాస్కెట్స్ నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఇందులో జిల్లా బాలుర జట్టు సెమీఫైనల్‌లో కృష్ణ జట్టుతో తలపడి 3–2 స్కోర్‌తో గెలిచింది. తర్వాత ఫైనల్‌లో అనంతపురం జట్టు చేతిలో 3–4 స్కోర్‌తో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. అసోసియేషన్ సభ్యులు కృష్ణారెడ్డి, గవ్వ శ్రీనివాసరావు, కె మురళీకృష్ణ జట్టును అభినందించారు. బాలికల జట్టు లీగ్ దశలో ప్రకాశంపై 32–02, చిత్తూరుపై 39–13 స్కోర్‌తో గెలిచి, క్వార్టర్‌ఫైనల్‌లో విశాఖ జట్టు చేతిలో 57–48 స్కోర్‌తో ఓడి తిరుగుముఖం పట్టింది.
క్వార్టర్ ఫైనల్‌లో ఓడిన బాలికల జట్టు