
సాక్షి, పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి మోహన రంగాను ప్రభుత్వంతోనే చంపించారని అన్నారాయన. ఆరుగోలనులో సోమవారం రంగా విగ్రహ ఆవిష్కరణ సభలో బొలిశెట్టి మాట్లాడుతూ..
తనకు ప్రాణ రక్షణ కల్పించండి అని రంగా నిరాహార దీక్ష చేశారు. అలాంటి సమయంలో కొంత మంది నాయకులు ప్రభుత్వంతోనే ఆయన్ని చంపించారు అని అన్నారు. బొలిశెట్టి వ్యాఖ్యలతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం ఆ కామెంట్లపై చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే.. రంగా హత్య సమయంలో అధికారంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. విజయవాడలో నిరహార దీక్షలో ఉన్న రంగాను 1988 డిసెంబర్ 26న కొందరు దుండగులు స్వామిమాలలో వచ్చి హత్య చేశారు. ఈ ఘటన తర్వాత విజయవాడలో తీవ్ర అల్లర్లు చెలరేగగా.. 40 రోజులపాటు కర్ఫ్యూ కొనసాగింది. ఆయన హత్య రాజకీయ, కుల, సామాజిక నేపథ్యంతోనే జరిగిందనే చర్చా ఇప్పటికీ నడుస్తోంది.
