
శ్రీవారి క్షేత్రం.. భక్త జనసంద్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి భక్తులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆదివారం పెద్దఎత్తున ఆలయానికి వచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తజనంతో కళకళలాడాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అనివేటి మండపం, కల్యాణ కట్ట ఇలా అన్ని విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించినట్టు దేవస్థానం అధికారులు తెలిపారు.
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చి మ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాల్లో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉదయం నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు వర్షంలోనే తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆలయ కమిటీ వారు, పోలీసులు ప్రత్యేక చర్యలు చేట్టారు.
కై కలూరు: కొల్లేటికోట శ్రీపెద్దింటి అమ్మవారిని భక్తులు ఆదివారం భారీఎత్తున దర్శించుకున్నారు. శ్రావణమాసం కావడంతో అనేకమంది భక్తులు వివిధప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు కృష్ణాజిల్లాకు చెందిన అనేక ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ సందర్భంగా లడ్డూ ప్రసాదం, రూమ్‌ల అద్దె, ఇతర మార్గాల ద్వారా ఆలయానికి రూ.40,405 ఆదాయం సమకూరినట్లు కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాస్ తెలిపారు.

శ్రీవారి క్షేత్రం.. భక్త జనసంద్రం

శ్రీవారి క్షేత్రం.. భక్త జనసంద్రం