భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం విజేత స్టోర్‌ను జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఏఎస్‌ఆర్ రెడ్డి తనిఖీ చేసి బూజు పట్టిన పరోటాలను విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరానికి చెందిన పడమటి దిలీప్‌కుమార్ ఈనెల 5వ తేదీన విజేత స్టోర్‌లో ప్రెస్ బెల్ కంపెనీ మలబార్ పరోటాలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లి చూడగా బూజు పట్టి ఉన్నాయి. దీంతో ఆయన వాటిని స్టోర్‌కు తీసుకువచ్చి అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌కు చూపించారు. అదే బ్యాచ్‌లో ఉన్న మరో ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి చూడగా ఆ ప్యాకెట్‌లోని పరోటాలూ బూజు పట్టి ఉండడంతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఏఎస్‌ఆర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఆయన స్టోర్‌ను తనిఖీ చేసి పరోటాలు బూజు పట్టి ఉండడాన్ని గుర్తించి జేసీ కోర్టుకు కేసు నమోదు చేశారు. రాజమండ్రికి చెందిన ప్రెస్ బెల్ కంపెనీ నుంచి పరోటాలు సరఫరా అవుతున్నాయని, మిగిలిన వాటిని కూడా పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిస్తామని ఏఎస్‌ఆర్ రెడ్డి చెప్పారు.
బూజు పట్టిన పరోటాల విక్రయంపై కేసు నమోదు