
సీసీ కెమెరా ఏర్పాటుపై మండిపాటు
ఉండి: మేమేమైనా నేరస్తులమా? లేక తీవ్రవాదులమా.. మా ప్రాంతంలో పోలీసులు సీసీ కెమెరా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని పాములపర్రులో దళితులు ఆదివారం నిరసన తెలిపారు. ఇప్పటికే దళితపేట వద్ద పోలీసులు పహారా కాస్తూ తమ స్వేచ్ఛను హరిస్తున్నారని, ఇప్పుడే ఏకంగా సీసీ కెమెరా ఏర్పాటు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల కోసం అయితే గ్రామంలోని సెంటర్‌లో కెమెరాలు పెట్టాలని, దళితులను కించపరిచేలా ఇక్కడ ఏర్పాటుచేయడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా సీసీ కెమెరా ఓ ప్రైవేట్ వ్యక్తి పోలీసులకు ఇచ్చారని, అతడి మ నుషులే పాములపర్రుకు తెచ్చారని వార్డు సభ్యుడు దర్శి సాల్మన్‌రాజు, దళిత యువకులు మామిడిపల్లి ఏసేబు, దర్శి పరదేశి, తేలి మహేష్,శ్రీనివాస్, ఊబా రమేష్ ఆరోపించారు. దీనిపై ఎస్సై ఎండీ నసీరుల్లాను వివరణ కోరగా సీసీ కెమెరాను తామే ఏర్పాటు చేశామన్నారు. శాంతిభద్రతలకు విఘా తం కలిగించేలా ఎవరైనా అల్లర్లకు పాల్పడినా, లేదా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా, ఇతర ప్రాంతాల వారు వచ్చి ఇబ్బందులు తలెత్తేలా వ్యవహరించినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకే కెమెరా ఏర్పాటు చేశామన్నారు.