
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
తణుకు అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు క్షీ ణించాయని, పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో రెడ్‌బుక్‌ను అమలుచేసే పనిలో ఉన్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ కా రుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. త ణుకులోని ఆయన నివాసంలో ఆదివారం పార్టీ శ్రేణులతో సమావేశమై మాట్లాడారు. కూటమి నా యకులు తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల్లో రౌడీయిజం చేయిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ఏకంగా వందలాది మంది పచ్చ గూండాలు బీసీ వర్గీయులపై దాడికి దిగడం, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఖాకీలు తప్పులమీద తప్పులు చేసుకుంటూ పోతున్నారని, ఒక పక్క న్యాయస్థానాలు తప్పుపడుతున్నా వీరి తీరు మారడం లేదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నేతలపై ఐటీడీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని అన్నారు. రోజులు ఎప్పుడూ ఒకలానే ఉండవని, మీరు చూపిస్తున్న మార్గం ఎదుటివారికి కూడా కనిపిస్తుందనే విషయాన్ని మరచిపోవద్దని కారుమూరి హెచ్చరించారు.
ఇది వంచన ప్రభుత్వం
నా రాజకీయ జీవితంలో ఇంతటి అరాచకం, అఘాయిత్యాలు, మోసం, దాడులు, వంచన చేసిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని, మొదటిసారి ఇప్పుడే చూస్తున్నానని కారుమూరి అన్నారు. కూటమి ప్రభుత్వం తన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మార్చేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై, నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం 13 నెలల కాలంలో సుమారు రూ.2 లక్షల కోట్లు అప్పులు చేసిందని, దీంతో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ ఎప్పుడు అమలుచేస్తారని ప్రజలే ప్రశ్నిస్తున్నారని కారు మూరి నాగేశ్వరరావు అన్నారు.