అయ్యవార్లపై మూల్యాంకన భారం | - | Sakshi
Sakshi News home page

అయ్యవార్లపై మూల్యాంకన భారం

Aug 11 2025 7:33 AM | Updated on Aug 11 2025 7:35 AM

నిడమర్రు: కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరుతో విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న పరీక్షల విధానాన్ని చూసి ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి జరిగే సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ–1) పరీక్షలు అటు విద్యార్థికి, ఇటు ఉపాధ్యాయులకు పరీక్షే అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలకు అందించిన మూల్యాంకన పుస్తకాలతో మరో బోధనేతర పనికి సిద్ధమవ్వాలని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.

పొందుపరిచి.. స్కాన్‌ చేసి..

ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించే ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షల మొ త్తం సమాచారాన్ని విద్యాశాఖ అందించిన మూల్యాంకన పుస్తకంలో ఉపాధ్యాయులు పొందుపరచాలి. అలాగే విద్యార్థుల సా మర్థ్యాలకు సంబంధించిన 15 మార్కుల అంశాలను ఉపాధ్యాయుడే స్వయంగా నమోదుచేయాలి. ఆయా సబ్జెక్టుల్లో ఆయా సామర్థ్యంలో ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి.. ఎక్కువ వస్తే ఎలా గుర్తించావు.. అనే విషయం వివరంగా రాయల్సి ఉంటుంది. అనంతరం వాటిని స్కాన్‌ చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇప్పటికే పెరుగుతున్న బోధనేతర పనులకు తరగతికి దూరమవుతున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం తాజాగా మూల్యాంకన భారం మోపడంపై తలలు పట్టుకుంటున్నారు.

ఉరుకులు.. పరుగులు

మూల్యాంకన పుస్తకాలు ఆటోలో తెచ్చుకోవడం, బ్యాలెన్స్‌ పుస్తకాల కోసం ఎంఈఓ కార్యాలయాల చుట్టూ తిరగడం, మూ ల్యాంకన పుస్తకాల్లో విద్యార్థుల ప్రతిస్పందనలు రాయడం ఒక ఎత్తయితే.. విద్యార్థులతో ఓఎంఆర్‌ షీట్‌లో జవాబులు రాయించడం మరో ఎత్తు. 1వ తరగతి విద్యార్థి కూడా ఓఎంఆర్‌ షీట్స్‌లోనే పరీక్షలు రాయడం ఆ ఉపాధ్యాయులకు పరీక్షే. అలాగే మొత్తం అంశాలు, ఓఎంఆర్‌ షీట్స్‌ను స్కాన్‌ చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం, ఆన్‌లైన్‌లో మార్కులు నమోదు చేయడం వంటి పనులకే సమయం సరిపోతుందని టీచర్లు ఆవేదన చెందుతున్నారు.

గురువులకే పరీక్ష !

ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు

ప్రతి తరగతి, సబ్జెక్టుకు మూల్యాంకన పుస్తకాల పంపిణీ

ఆ పుస్తకాల స్కానింగ్‌తో సమయం వృథా

నేటి నుంచి ఎఫ్‌ఏ–1 పరీక్షలు

ఉపాధ్యాయ సంఘాల నేతల ఆందోళన

బోధనేతర భారం పెరిగి..

మూల్యాంకన పుస్తకాలతో ఉపాధ్యాయులకు బోధనేతర భారం మరింత పెరుగుతుంది. విద్యార్థి ప్రతిస్పందనలతో పాటు ఓఎంఆర్‌ షీట్‌లో కోడ్లు, అపార్‌ ఐడీలు, పెన్‌ ఐడీలను తప్పులు లేకుండా రాసేలా చూడటం, జవాబులను దిద్దిన తర్వాత స్కోరింగ్‌ ఇవ్వడం, దీనికి వివరణ రాయడంతో పాటు పేజీలన్నింటినీ స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి. వీటి కోసం అవుట్‌ సోర్సింగ్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం.

– లంకలపల్లి సాయిశ్రీనివాస్‌, స్టేట్‌ ఫ్యాప్టో చైర్మన్‌

సమయం హరిస్తుంది

సంస్కరణలు విద్యార్థులకు మేలు చేయాలే తప్ప కీడు కాదు. మూల్యాంకన పుస్తకం వి ధానంతో ఉపాధ్యాయులకు అదనపు భారం తప్ప విద్యార్థులకు ప్రయోజనం కనిపించడం లేదు. కొత్త విధానంలో తరగతి గదిలోనే విద్యార్థుల ప్రతిస్పందనలు పరిశీలించి మూల్యాంకన పుస్తకంలో నమోదు చే యాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో పదుల సంఖ్యలో వి ద్యార్థులు ఉంటారు. దీంతో బోధనా కాలం హరిస్తుంది. దీంతో విద్యా ప్రమాణాలు తగ్గే ప్రమాదముంది.

– బొర్రా గోపీ మూర్తి, టీచర్స్‌ ఎమ్మెల్సీ

శిక్షణ లేదు.. స్పష్టత లేదు

మూల్యాంకనంలో మార్పులపై ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా ఎఫ్‌ఏ–1 పరీక్షలకు విద్యాశాఖ సిద్ధం చేసింది. దీంతో వాట్సాప్‌లో వస్తున్న సమాచారం ఆధారంగానే పరీక్షలు నిర్వహించేందుకు ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నా రు. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈనెల 4 నుంచి ఎఫ్‌ఏ–1 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా మూల్యాంకన పుస్తకాలు మండలాలకు అందకపోవడంతో వాయిదా వేశారు. అయితే ఈ పుస్తకాలను ఎలా నిర్వహించాలి, ఏఏ అంశాలు పూరించాలనే విషయాలపై కేవలం వాట్సాప్‌లో వస్తున్న మెసేజ్‌లే తప్ప ఏ అధికారి సమగ్రంగా వివరించే అవకాశం లేకుండానే పరీక్షలు ప్రారంభించడాన్ని ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు.

అయ్యవార్లపై మూల్యాంకన భారం 1
1/2

అయ్యవార్లపై మూల్యాంకన భారం

అయ్యవార్లపై మూల్యాంకన భారం 2
2/2

అయ్యవార్లపై మూల్యాంకన భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement