
13న మాజీ సీఎం జగన్ రాక
భీమవరం : ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పు ప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు ఈనెల 13న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం రానున్నారు. ఆదివారం హెలీప్యాడ్ ప్రాంతాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పరిశీలించారు. భీమవరం శివారు వీఎస్‌ఎస్ గార్డెన్స్‌లో వివాహ వేడుక జరుగనున్నందున సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులను పరిశీలించారు. ఆయన వెంట వాసుబాబు, వైఎస్సార్‌సీపీ భీమవరం ని యోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, భీమవరం పట్టణ అధ్యక్షుడు గా దిరాజు రామరాజు తదితరులు ఉన్నారు.
టోల్‌గేట్ క్రాంటాక్టర్‌కు నోటీసులు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన టోల్‌గేట్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌కు దేవస్థానం ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి ఆదివారం నోటీసు జారీ చేశారు. బైక్‌లు, మోపెడ్‌లకు రూ.10ల రుసుం వసూలు చేయాల్సి ఉండగా రూ.20లు వ సూలు చేస్తున్నారు. దీనిపై ఆదివారం ‘సాక్షి’లో ‘శ్రీవారి కొండపై టోల్ బాదుడు’ శీర్షికన కథనం ప్రచురించగా ఈఓ స్పందించారు. మూడు రోజుల్లోపు సంజాయిషీ ఇవ్వాలని కాంట్రాక్టర్‌కు నోటీసు ఇచ్చారు.
16న ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై చర్చ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చీరాలలో ఈనెల 16న జరిగే అపుస్మా (ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రైవేట్ పాఠశా లల యాజమాన్యాల సమస్యలపై చర్చిస్తా మని అపుస్మా రాష్ట్ర అధ్యక్షుడు కె.తులసీ ప్ర సాద్ తెలిపారు. ఆదివారం స్థానిక శ్రీశ్రీ పా ఠశాలలో నిర్వహించిన జిల్లా కార్యనిర్వాహక కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వి ద్యాహక్కు చట్టం ప్రకారం అడ్మిషన్ పొందిన వారికి ప్రభుత్వం కొత్త బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకోమనడం సరికాదదన్నారు. స్టార్ రేటింగ్ ప్రకారం కేవలం రూ.8 వేలు ఫీజులుగా ఇస్తామంటున్నారని, తల్లికి వందనం ఉచిత విద్యలో భాగమే కాబట్టి విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రవేశాలు పొందిన వారికి కనీసం రూ.13 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎంబీఎస్ శర్మ మా ట్లాడుతూ యాప్‌లు, బోధనేతర పనులను ఉ పాధ్యాయులకు కేటాయించడం, ట్రాన్స్‌పోర్ట్, గ్రీన్ టాక్స్ వంటి సమస్యలపై చర్చించి ప్ర భుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు.