ఆటో డ్రైవర్ల ఆక్రందన | - | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్ల ఆక్రందన

Aug 11 2025 7:35 AM | Updated on Aug 11 2025 7:35 AM

ఆటో డ

ఆటో డ్రైవర్ల ఆక్రందన

కూటమి ఏకపక్ష నిర్ణయం

తమ ఉపాధిని దెబ్బతిసేలా ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆటో యూనియన్‌ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఆటో యూనియన్లతో కనీసం చర్చించలేదని అంటున్నారు. ఆటోల ద్వారా ప్రభుత్వానికి పలురకాలుగా ఆదాయం వస్తుందని చెబుతున్నారు. డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి, ఆర్థిక సాయం వంటి వాటిపై మాట్లాడకపోవడం దారుణమని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాలని కోరుతూ జిల్లాలోని ఆటో కార్మికులు మంగళవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందించడానికి సన్నద్ధమవుతున్నారు.

భీమవరం(ప్రకాశం చౌక్‌): కూటమి ప్రభుత్వం అ మలు చేయనున్న ఉచిత బస్సు (సీ్త్ర శక్తి) పథకంతో తాము ఉపాధి కోల్పోతామంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి, ఫైనాన్స్‌లపై ఆటోలు కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నామని, ఉచిత బస్సుతో ప్రయాణికులు లేక, ఆటోలు నడవక తాము బతికేదెలా అంటూ ఆవేదన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి, ఆర్థిక సాయంపై మాట్లాడకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదని అంటున్నారు. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. ఉమ్మడి పశ్చిమలో 20 నుంచి 60 ఏళ్ల వయసున్న సుమారు 47 వేల మంది కార్మికులు ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తమ పొట్ట కొట్టడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చారని వీరు మండిపడుతున్నారు. ఇప్పటికే ఉచిత బస్సుపై పలు రూపాల్లో ఆందోళనలు తెలుపుతున్నారు.

ఫైనాన్స్‌లో కొనుగోలు

జిల్లాలో నడుస్తున్న 90 శాతం ఆటోలను డ్రైవర్లు ఫైనాన్స్‌లో కొనుగోలు చేశారు. ఆటో ధర రూ.4 లక్షల వరకు ఉండగా.. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు వాయిదా కడుతున్నారు. అలాగే నెలకు ఆటో నిర్వహణకు రూ.2 వేలు, మరమ్మతులకు రూ.3 వేలు మొత్తంగా రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. వీటితో పాటు రవాణా శాఖ అధికారుల కేసులు, ఏడాదికి బ్రేక్‌, ఫిట్‌నెస్స్‌ కోసం ఖర్చులు అదనం. ఈ పరిస్థితుల్లో రోజుకు డీజిల్‌ ఖర్చులు కాకుండా వీటి కోసమే రూ.800కు పైగా వెచ్చించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఉచిత బస్సుతో ప్రయాణికులు లేక ఆటోలు నడపకపోతే జీవ నం ఎలా సాగుతుందని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. అప్పు లు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు.

మాకు న్యాయం చేయాలి

ఇప్పటికే ఆటోలు పెరిగి డ్రైవర్లకు ఉపాధి అంతంతమాత్రంగా ఉంది. ఉచిత బస్సు తో పూర్తిగా ఉపాధి కోల్పో యి ఆటోలను ఫైనాన్స్‌ కంపెనీలకు అప్పగించాల్సిందే. డ్రైవర్లంతా ఆటోలు వదిలి కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలి.

– డి.నరేష్‌, ఆటోడ్రైవర్‌, పొలమూరు

చాలా ఆందోళనగా ఉంది

ఉచిత బస్సుపై చాలా ఆందోళన చెందుతున్నాం. ఆటో లు ఎక్కేవారి సంఖ్య బాగా తగ్గిపోతుంది. ట్రిప్పులు లేక, ఆదాయం లేక కుటుంబా లను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు. మాకు ప్రత్యామ్నాయ ఉపాధి లేదా మరేదైనా ఆదాయ మార్గం చూపించిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాం.

– పి.జగన్‌, ఆటోడ్రైవర్‌, భీమవరం

మహిళా ప్రయాణికులే ఎక్కువ

ఆటోలో 90 శాతం మహిళలే ప్రయాణిస్తారు. వారి ద్వారానే మేం ఉపాధి పొందుతున్నాం. ఇప్పుడు ఉచిత బస్సుతో ఆటోలు ఎక్కేవారు తగ్గిపోతే మా పరిస్థితి ఏంటి. కూలీ పనులకు, ఆక్వా పరిశ్రమలకు మహిళలను తీసుకువెళుతూ ఉపాధి పొందుతున్నా. ఉచిత బస్సుతో అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం.

– పి.గోపి, ఆటోడ్రైవర్‌, భీమవరం

ఉపాధికి ఇబ్బందులు

ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు తప్పవు. ఆటోలకు ఫైనాన్స్‌లు కట్టలేక, కు టుంబాలను పోషించుకోలేక అవస్థలు పడాల్సిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల కష్టాలు గురించి ఆలోచన చేసి మాకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏకపక్షంగా ఉచిత బస్సు పథకాన్ని అమలుచేయడం తగదు.

– సీహెచ్‌ రామకృష్ణ, ఆటోడ్రైవర్‌, వేండ్ర

ప్రత్యామ్నాయం చూపాలి

ఉచిత బస్సుకు మేం వ్యతిరేకం కాదు గానీ ఆటో కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని యూనియన్లతో చర్చించాల్సింది. ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. ఆటో కార్మికులను ఆదుకునేలా ప్రకటన చేయాలి. నెలనెలా ఆటో కార్మికులకు భృతి ఇవ్వాలి. చాలా మంది అప్పులు చేసి ఆటోలు కొన్నారు. వారందరినీ ఆదుకోవాలి.

– ఇంటి సత్యనారాయణ, జిల్లా ఆటో యూనియన్‌ అధ్యక్షుడు

ఆటో.. భవిత ఎటో

ఉచిత బస్సుతో ఉపాధికి ముప్పు

ఫైనాన్స్‌లపై 90 శాతానికి పైగా ఆటోల కొనుగోలు

నెలనెలా వాయిదాలతో ఇప్పటికే ఇబ్బందులు

ప్రత్యామ్నాయ ఉపాధికి డ్రైవర్ల డిమాండ్‌

కూటమి ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో కష్టకాలం

ఉమ్మడి జిల్లాలో 40 వేల మంది డ్రైవర్లు

40 వేల ఆటోలు.. 47 వేల మంది కార్మికులు

ఉమ్మడి పశ్చిమలో సుమారు 40 వేల ఆటోలు ఉన్నాయి. ఏలూరు జిల్లాలో 24 వేలు, పశ్చిమగోదావరి జిల్లాలో 16 వేల వరకు ఆటోలు ఉండగా మొత్తంగా 40 వేల ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వీరితో పాటు ఆటో మెకానిక్‌, సీటు వర్క్‌, స్పేర్‌ పార్ట్స్‌ విక్రయదారుల కుటుంబాలు మరో 7 వేల వరకు ఉంటాయి. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు తీసుకురావడం ద్వారా ఆటోలు నడపటం కష్టం కాగా ఉపాధి లేక సుమారు 47 వేల కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తవచ్చు.

ఆటో డ్రైవర్ల ఆక్రందన 1
1/6

ఆటో డ్రైవర్ల ఆక్రందన

ఆటో డ్రైవర్ల ఆక్రందన 2
2/6

ఆటో డ్రైవర్ల ఆక్రందన

ఆటో డ్రైవర్ల ఆక్రందన 3
3/6

ఆటో డ్రైవర్ల ఆక్రందన

ఆటో డ్రైవర్ల ఆక్రందన 4
4/6

ఆటో డ్రైవర్ల ఆక్రందన

ఆటో డ్రైవర్ల ఆక్రందన 5
5/6

ఆటో డ్రైవర్ల ఆక్రందన

ఆటో డ్రైవర్ల ఆక్రందన 6
6/6

ఆటో డ్రైవర్ల ఆక్రందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement