
●ఎమ్మెల్యే తాలూకా..
ఏలూరు నగరంలో ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు లారీలు, ఇతర భారీ వాహనాల రాకపోకలు నిషేధం. ఈ సమయంలో వాహనాలు పొరపాటున ప్రవేశిస్తే రూ.2 వేలు అంతకుమించి అపరాధ రుసుం చెల్లించాల్సిందే.. ఇదంతా కేవలం సామాన్యులకే వర్తించే రూల్స్.. జూట్‌మిల్లు సమీపంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు వరుసగా నాలుగు లారీలు రావటంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు ఆపారు. కానిస్టేబుల్ సీఐకు సమాచారం ఇచ్చారు. మేం ఎమ్మెల్యే గారి తాలుకా మా వాహనాలే అపుతారా.. అంటూ డ్రైవర్ ఏవరికో ఫోన్ చేసి ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చాడు. వెంటనే ఆ లారీలను నగరంలోకి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు

●ఎమ్మెల్యే తాలూకా..