
రోల్‌బాల్ జట్టు ఎంపిక
తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ రోల్ బాల్ స్టేట్ సెలక్షన్ క్యాంప్ ఈనెల 7 నుంచి 10 వరకు తణుకు సిల్వర్ జూబ్లీ కాలనీలోని మునిసిపల్ స్కేటింగ్ పార్కులో నిర్వహించారు. వివిధ విభాగాల్లో జాతీయస్థాయి పోటీలకు జట్టు ఎంపిక చేశారు. మొత్తం 100 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ క్యాంపులో 60 మందిని ఎంపిక చేసినట్లు రోల్‌బాల్ స్టేట్ సెక్రటరీ అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో కేరళలోని కొల్లాంలో నిర్వహించే సౌత్ జోనల్స్‌కి జట్టును సంసిద్ధం చేశామని చెప్పారు. 60 మంది ఎంపిక కాగా.. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తణుకుకు చెందిన 9 మంది క్రీడాకారులు ఉన్నట్లుగా వివరించారు. కార్యక్రమంలో స్టేట్ టెక్నికల్ చైర్మన్ వీజీ ప్రేమ్‌నాథ్, స్టేట్ ఆర్గనైజింగ్ డైరెక్టర్ తోట లలిత ప్రియ, కోచెస్ కమిటీ డైరెక్టర్ పూసర్ల సంతోష్ కుమార్, ఉమెన్ కమిషన్ డైరెక్టర్ వానపల్లి లావణ్య, కోచెస్ కమిటీ అసిస్టెంట్ డైరెక్టర్ మధుబాబు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కోచ్‌లు పాల్గొన్నారు.