
యోగా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
నూజివీడు: యోగాసన పోటీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ నెల 10న ఏలూరులోని ప్రేమాలయ ఓల్డేజ్ హోంలో జరిగిన ఈ పోటీలో 14 మంది విద్యార్థులు వేర్వేరు ఆసనాలలో 16 పతకాలను సాధించారు. 9 మంది గోల్డ్ మెడల్స్, ఆరుగురు సిల్వర్ మెడల్స్, ఒకరు బ్రాంజ్ మెడల్ సాధించడం విశేషం. జూనియర్స్ విభాగంలో తనూష, హరిత, దివాకర్‌లు గోల్డ్ మెడల్స్ సాధించగా, సీనియర్స్ విభాగంలో అశోక్, అభిషేక్, దీపక్ నాయుడు గోల్డ్ మెడల్స్ సాధించారు. హరిత, అశోక్, దీపక్ నాయుడులు యోగాసనాలలోని వివిధ ఈవెంట్లలో రెండేసి చొప్పున గోల్డ్ మెడల్స్ సాధించడం విశేషం. జూనియర్స్ విభాగంలో దేవిశ్రీ, స్పందన, ప్రమీల, వెంకటలక్ష్మి, యుగంధర్, దామోదర్‌లు సిల్వర్ మెడల్స్ సాధించగా, గీతిక అనే విద్యార్థిని బ్రాంజ్ మెడల్ సాధించింది. యోగాసనాలలో పతకాలు సాధించిన విద్యార్థులను ఇన్‌చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ లక్ష్మణరావు, అకడమిక్ డీన్ చిరంజీవి, అకడమిక్ అసోసియేట్ డీన్ రఘు, యోగా టీచర్ పి. చంద్రశేఖర్ లు అభినందించారు.
అభయాంజనేయ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు
పెదపాడు: మండలంలోని అప్పనవీడులోని వేంచేసియున్న శ్రీ అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం 10,32,522 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మండలంలోని మొండూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి ఎం.రాంబాబు పర్యవేక్షణలో హుండీ లెక్కించారు. 76 రోజులకు ఈ లెక్కింపు చేసినట్లు తెలిపారు.
ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి కృషి
భీమవరం: ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. సోమవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో వెస్ట్ గోదావరి ప్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ మంత్రిని కలిసి ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిపై అమెరికా 50 శాతం పన్ను విధించడంతో ధరల్లో తీవ్ర వ్యత్యాసం వచ్చిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.జగపతిరాజు, గాదిరాజు వెంకట సుబ్బరాజు వినతిపత్రం అందించారు. శ్రీనివాసవర్మ మాట్లాడుతూ రొయ్యల రైతుల కష్టాలు తనకు తెలుసుని ఆక్వా సాగుకు గతంలో ఉన్న మంచి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. రైతుల ఇబ్బందులను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని శ్రీనివాసవర్మ చెప్పారు.

యోగా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

యోగా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ