1.15 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
భీమవరం: జిల్లాలో 249 రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటివరకూ 1,15,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రబీ 2024–25 గాను జిల్లాలో జరుగుతున్న ధాన్యం కొనుగోలుపై కొనుగోలు కమిటీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రైతుల ఖాతాలలో ధాన్యం సొమ్ములను 48 గంటల సమయంలో జమ చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కోసం కావాల్సిన హమాలీలు, రవాణా వాహనాలు సిద్ధంగా ఉంచామన్నారు. ఇప్పటివరకూ 59 లక్షల గోనెసంచులను రైతులకు పంపిణీ చేశామన్నారు. పది రోజులకు సరిపడా గోనె సంచులు అందుబాటులో ఉంచామన్నారు. ధాన్య కొనుగోలులో సమస్యలు ఉంటే జిల్లాస్థాయిలో కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 81216 76653కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. జిల్లా పౌరసరఫరాల మేనేజర్ టి.శివరామ ప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి జెడ్.వెంకటేశ్వరులు, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి శ్రీ నాగరాజు, జిల్లా పౌరసరఫరాల అధికారి ఎన్.సరోజ, తహసీల్దార్లు, మండల వ్యవసాయ, కో–ఆపరేటివ్ అధికారులు, పౌరసరఫరాల డీటీలు పాల్గొన్నారు.


