ఎరువుల దుకాణాల తనిఖీ
అత్తిలి: మండలంలోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి టీకే రాజేష్ బుధవారం తనిఖీ చేశారు. ఎరువుల డీలర్లు స్టాక్ నిల్వలను ఎప్పటికప్పుడు స్టాక్ బోర్డులపై రాయాలని, ఈపాస్ నందు నమోదు చేసి బిల్లులు కచ్చితంగా ఇవ్వాలని ఆదేశించారు. అత్తిలి మండలంలో 210 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, అవసరమైన యూరియా సొసైటీల ద్వారా, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు సరఫరా చేస్తామన్నారు.
విత్తనశుద్ధి తప్పనిసరి
దాళ్వాసాగులో రైతులు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయాలని మండల వ్యవసాయశాఖ అధికారి టీకే రాజేష్ అన్నారు. బుధవారం అత్తిలి మండలం వరిఘేడు గ్రామంలో ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్బన్‌డిజమ్ ఒక లీటర్ నీటికి ఒక గ్రాము కలిపి అందులో విత్తనం నానబెట్టాలన్నారు. విత్తనశుద్ధి అనంతరం నారుమడి చల్లుకోవాలని, కచ్చితంగా మురగదమ్ములు చేయాలన్నారు.


