క్రీస్తు బోధనలు అనుసరణీయం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): శాంతియుత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు బోధనలను అనుసరించాలని బిషప్ పొలిమేర జయరావు సూచించారు. స్థానిక బిషప్ హౌస్‌లో బుధవారం రాత్రి క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు. జయరావు క్రీస్తు బోధనలను వివరించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్‌ను కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో సెయింట్ మైఖేల్ చర్చి ఫాదర్ దిరిసిన ఆరోన్, ఏలూరు మేత్రాసనం ప్రోక్యురేటర్ ఫాదర్ బేతంపూడి రాజు, నిర్మలగిరి నిత్య అన్నదాన కాంట్రాక్టర్ కల్లే నాగేశ్వరరావు, ఏలూరు మేత్రాసనం ఛాన్సలర్ ఫాదర్ ఇమ్మానియేల్, ఫాదర్ మైఖేల్ ఇంజమాల తదితరులు పాల్గొన్నారు.


