ఆరోపణలు అవాస్తవం
ఉండి: కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం బంటుమిల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని ఏలూరి రంగబాబు అతని కుటుంబ సభ్యులకు చెందిన భూములు ఉండి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఉండి ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్ట్రార్ వీరవల్లి సురేష్ బుధవారం స్పష్టం చేశారు. వివిధ సర్వే నంబర్లలోని 36 ఎకరాల భూములు ఇతరుల పేరున ఉండి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయని చేస్తున్న ఆరోపణలు నిరాధారమని చెప్పారు. ఈ భూములన్నీ బంటుమిల్లి సబ్‌రిజిస్ట్రార్ పరిధిలో ఉన్నాయన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే ఈ భూములు నిషేదిత జాబితాలో నమోదు కాబడి ఉన్నాయని, ఈ భూముల రిజిస్ట్రేషన్‌లు కాని రిజిస్ట్రేషన్ పెండింగ్ కానీ లేవని సురేష్ తెలిపారు.


