సౌత్ ఇండియన్ సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక
వీరవాసరం: విజయవాడలో ఈనెల 23, 24 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో జరిగిన సైన్స్ ఫెయిర్‌లో వీరవాసరం మండలం రాయకుదురు హైస్కూలు విద్యార్థుల ప్రదర్శించిన ప్రాజెక్టుతో సౌత్ ఇండియన్ సైన్స్ ఫెయిర్‌కు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. విద్యార్థులు జి.సాయి సుజిత్, డి.జయసాయి శ్రీనివాస, గణేష్ ఎడారిలో మంచును సాంద్రీకరించి, ఆనీటిని తాగునీటి అవసరాలకు ఎలా వాడుకోవచ్చో ప్రాజెక్టు రూపొందించి ప్రథమ స్థానం సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, గైడ్ టీచర్స్ పి.గజేంద్రగట్కర్, లక్ష్మీదుర్గను కలెక్టర్ సీహెచ్ నాగరాణి, జిల్లా విద్యాధికారి నారాయణ, ఉప విద్యాశాఖాధికారి ఎన్. రమేష్, రాయకుదురు సర్పంచ్ గెడ్డం భారతి, ఎంపీపీ అడ్డాల శ్రీరామచంద్రమూర్తి తదితరులు అభినందించారు.


