
హ్యాండ్‌బాల్ రాష్ట్ర విజేత పశ్చిమగోదావరి
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–19 జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా సత్తా చాటింది. ఈ నెల 20న విజయవాడలోని ఆంధ్రా లయోల కాలేజీలో ప్రారంభమైన ఈ పోటీలకు 12 ఉమ్మడి జిల్లాలు ప్రాతినిధ్యం వహించాయి. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ పోటీల్లో పశ్చిమగోదావరి జట్టు వరుస విజయాలను సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో ప్రత్యర్థి తూర్పుగోదావరి జిల్లా జట్టును ఓడించి విన్నర్ ట్రోఫీని అందుకుంది. విజేతలకు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మల్లేశ్వరరావు, లయోల కాలేజీ వ్యాయామ విద్యా విభాగాధిపతి డాక్టర్ కె.సుజాత ట్రోఫీలు అందజేశారు.