తవ్వేద్దాం.. దోచేద్దాం
న్యూస్‌రీల్
అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026
నియోజకవర్గంలోని ర్యాంపులన్నీ సీఆర్‌జెడ్ పరిధిలో ఉండటంతో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవు. అధికారులను అడుగుతుంటే అనుమతులు లేవంటున్నారే తప్ప అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం లేదు. ఎన్‌జీటీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక మేటలు, నదీ గర్భంలో తవ్వకాలు చేయడం వలన భూగర్భ జలాల్లో ఉప్పునీటి సాంద్రత పెరిగి స్థానిక ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది.
– చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ మంత్రి
పీఏసీ సభ్యుడిగా కొట్టు సత్యనారాయణ
సాక్షి, భీమవరం: వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ (ఆక్వా కల్చర్), అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామకంపై పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆకివీడు: ప్యాసింజర్ రైలు ఆలస్యం కాకుండా రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. డిసెంబర్ 28న సాక్షిలో ‘వందే భారత్‌తో ప్యాసింజర్ రైలు బలి’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి రైల్వే శాఖ స్పందించింది. జనవరి 1 నుంచి రైలు వేళల్లో మార్పు చేసింది. నర్సాపురం నుంచి 1.50కి బయలుదేరే రైలును 10 నిమిషాలు ముందుగా అంటే 1.40కి బయలుదేరేలా సమయాన్ని మార్చారు. దీంతో రైలును ఆకివీడులో ఆపాల్సిన అవసరం ఉండడం లేదు.
భీమవరం: ఎరువుల డీలర్లు, రైతులు యూరియాతో పాటు జింక్, గుళికలు కొనుగోలు చేయాలని ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల తయారీ కంపెనీల ప్రతినిధులు, హోల్ సేల్, రిటైల్ డీలర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నందున రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో కొన్నిచోట్ల హోల్ సేల్, రిటైల్ డీలర్లు యూరియాతోపాటు జింక్, గుళికలు ముడిపెట్టి కొనుగోలు చేయాలని రైతులను ఇబ్బంది పెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
సాక్షి, భీమవరం: మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఇలాకాలో ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా ఉంది. గతేడాది కోట్లాది రూపాయల ఇసుకను తరలించేసిన అక్రమార్కులు ఇప్పుడు అదే పనిలో పడ్డారు. తీరం వెంట తవ్వకాలకు సన్నాహాలు చేస్తున్నారు. కోడేరులో బాటలు సిద్ధం చేస్తుండగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు.
జిల్లాలోని సిద్ధాంతం నుంచి బియ్యపుతిప్ప వరకు ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల పరిధిలో వశిష్ట గోదావరిలో ఆరు ఓపెన్ రీచ్‌లు, ఐదు డీసిల్టేషన్ పాయింట్ల ద్వారా గతంలో ఇసుక తవ్వకాలు జరిగేవి. సముద్రపు ఆటుపోట్లతో ఈ ప్రాంతంలో ఇసుకలో ఉప్పునీటి సాంద్రత ఎక్కువగా ఉండి నిర్మాణ పనులకు అనుకూలంగా లేకపోవడటం, తీరప్రాంత పరిరక్షణలో భాగంగా రెండేళ్ల క్రితం కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్‌జెడ్) ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. అప్పటినుంచి ఈ ర్యాంపులు తెరుచుకోలేదు. ఇదే అదునుగా టీడీపీ నేతలు చక్రం తిప్పారు. సాధారణంగా ఇసుక తవ్వకాలు చేయాలంటే ఇరిగేషన్, మైనింగ్, పొల్యూషన్, రెవెన్యూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) అనుమతులు తప్పనిసరి. తీరప్రాంతం కోతకు గురికాకుండా ఇసుక మేట వేసిన చోట పరిమిత అడుగుల లోతున జట్టు కార్మికులతో పగటిపూట మాత్రమే తవ్వకాలు, లోడింగ్ చేయాలి. ఏ విధమైన అనుమతులు లేకుండానే సిద్దాంతం నుంచి నరసాపురం వరకు గతంలో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోయాయి. ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇసుకాసురుల ఇష్టారాజ్యం అయ్యింది. ఎన్‌జీటీ నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయినర్లతో నదీగర్భంలో రెండు మూడు మీటర్లు లోతున ఇసుకను తవ్వి కోట్లాది రూపాయల ఇసుకను కొల్లగొట్టారు. లోడింగ్ రూపంలో బయట అమ్మకాలు చేయడంతో పాటు ఎక్కడికక్కడ అనధికార స్టాకులు పెట్టి వరదల సమయంలో అధిక ధరలకు అమ్ముకున్నా అధికారులు కన్నెత్తి చూడలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
బాటలకు సన్నాహాలు : గోదావరిలో వరద ప్రభావం తగ్గడంతో సిద్ధాంతం, నడిపూడి, కోడేరు, కరుగోరుమిల్లి తదితర చోట్ల ఇసుక మేటలు బయటపడుతున్నాయి. ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు టీడీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. గోదావరిలోకి లారీల రాకపోకలకు వీలుగా బాటలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే కోడేరు వద్ద గతంలోని వరదలకు కొట్టుకుపోయిన పాత బాటను రాళ్లు వేసి పొక్లెయిన్లతో సరిచేస్తున్నారు.
బాట పనుల కోసం తీసుకొచ్చిన పొక్లెయిన్
గతేడాది తవ్వకాలు చేస్తున్న దృశ్యం (ఫైల్)
ఏలూరు (టూటౌన్): సంక్రాంతి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. 18న విశాఖపట్నం–చర్లపల్లి (08513), 19న చర్లపల్లి–విశాఖపట్నం(08514) ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపారు.
పలు ప్రత్యేక రైళ్లు రద్దు : ఈ నెల 13న నడవాల్సిన నర్సాపూర్–చర్లపల్లి, 17న నడవాల్సిన చర్లపల్లి–నర్సాపూర్, 19న వికారాబాద్–చర్లపల్లి, వికారాబాద్–కాకినాడ టౌన్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 20న వికారాబాద్–నర్సాపూర్, వికారాబాద్–కాకినాడ టౌన్ రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
తాడేపల్లిగూడెం రూరల్: శ్రీష్టా పరీక్షలలో పెదతాడేపల్లి అంబేద్కర్ గురుకుల విద్యార్ధులు ఘన విజయం సాధించారు. గురుకులం నుంచి 134 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ అర్హత సాధించి జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. బల్లి చరణ్‌కు ఆలిండియా 864 ర్యాంకు, పి.మనోజ్‌కుమార్‌కు 1252, జి.రిషి 1386, డి.రితీష్ కుమార్‌కు 1519, కె.జస్వంత్ 1875 ర్యాంకు సాధించి సంస్థకు గర్వకారణంగా నిలిచారు. విద్యార్థులలో సుమారు 25 మందికి ఫస్ట్ రౌండ్‌లో సీట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గురుకుల ప్రిన్సిపాల్ బి.రాజారావు, ఉపాధ్యాయులు బి.ప్రతాప్, ఆనందరావు, కృష్ణ, బలరాం, రవి విద్యార్ధులను అభినందించారు.
ఆకివీడు: ఎట్టకేలకు ఆకివీడు వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంతం శుభ్రపడింది. ఏఎంసీ ప్రాంగణంలో ఇటీవల భారీగా పిచ్చిమొక్కలు, పాదులు విపరీతంగా పెరిగిపోయాయి. దీనిపై ఇటీవల ‘సాక్షి’లో వచ్చిన కథనానికి ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, కార్యదర్శి యోగేశ్వరరావు స్పందించి ప్రాంగణాన్ని జేసీబీతో శుభ్రం చేయించారు. పల్లంగా ఉన్న మార్కెట్ యార్డు ప్రాంతాన్ని మట్టితో పూడ్చి ఎత్తు చేయించి, ప్లాట్‌ఫారాలు అనుకూలంగా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
కోడేరు వద్ద బాట ఏర్పాటు చేస్తుండటంతో స్థానిక వైఎస్సార్‌సీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం తెలిసి బాట సిద్ధం చేస్తున్నవారు పొక్లెయినర్లను లంకల్లోకి తరలించేశారు. ఈ విషయమై వైఎస్సార్‌సీపీ నేతలు తహసీల్దార్ సోమేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తే సహించేది లేదని, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా అడ్డుకుంటామన్నారు. బాట ఏర్పాటుపై మైనింగ్‌శాఖ అధికారులు స్పందిస్తూ కోడేరు ప్రాంతంలో తనిఖీలు చేశామని, అయితే అక్కడ ఇసుక తవ్వకాలు చేస్తున్నట్టు ఆధారాలు దొరకలేదని, రాళ్లతో ఉన్న మట్టి దిబ్బలు, మధ్యలో అక్కడక్కడ కొట్టుకుపోయిన పాత బాట కనిపించినట్టు పేర్కొనడం గమనార్హం.
జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు సన్నాహాలు
గోదావరి తీరం వెంట పాత ర్యాంపుల్లో బాటలు సిద్ధం చేసే పనిలో టీడీపీ నేతలు
కోడేరులో యంత్రాలతో బాటలు
అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
గతేడాది అక్రమ తవ్వకాలతో
కోట్లాది రూపాయలు స్వాహా
తవ్వేద్దాం.. దోచేద్దాం
తవ్వేద్దాం.. దోచేద్దాం
తవ్వేద్దాం.. దోచేద్దాం
తవ్వేద్దాం.. దోచేద్దాం
తవ్వేద్దాం.. దోచేద్దాం
తవ్వేద్దాం.. దోచేద్దాం
తవ్వేద్దాం.. దోచేద్దాం
తవ్వేద్దాం.. దోచేద్దాం
తవ్వేద్దాం.. దోచేద్దాం


