జల జీవన్ మిషన్ వేగంగా పూర్తి చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో జల జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖలను సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జలజీవన్ మిషన్ ఫేజ్ వన్ కింద కోస్తాలో తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సంబంధిత శాఖలతో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ స్థితిగతులను మెయిల్ కంపెనీ డీజీఎం పి.వాసు సమావేశంలో వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ఫేజ్ వన్ కింద జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆరు నియోజకవర్గాల్లోని 16 మండలాలు పరిధిలో 862 గ్రామాలను కలుపుతూ రూ.1400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. పైపులైను వేసే మార్గంలో ఆక్రమణల తొలగింపులో సంబంధిత అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ బి.శివన్నారాయణ రెడ్డి, నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా ప్రతినిధి సాల్మన్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో బహిరంగ మూత్ర విసర్జన నిరోధించేందుకు కట్టుదిట్టమై చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.


