కోడేరు ర్యాంపులో అనధికారిక బాటలు
పెనుగొండ: కోడేరు ఇసుక ర్యాంపులో అనధికారంగా చేస్తున్న బాట పనులు తక్షణమే నిలిపివేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు గురువారం ఆచంట తహసీల్దార్ సోమేశ్వరరావుకు, ఆచంట పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రాలు ఇచ్చారు. అ నంతరం వారు మాట్లాడుతూ కోడేరు ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తరలించడానికి ఇప్ప టికీ బాట పనులు చేస్తున్నారని, అయినా అధి కారులు, పోలీసులు పట్టించుకోవడం లేదన్నా రు. అధికార పార్టీ నాయకులకు అండగా అధికారులు ఉంటున్నారని ఆరోపించారు. ఇసుక తరలింపుపై త్వరలో హైకోర్టులో కేసు వేయనున్నామన్నారు. అక్రమంగా ఇసుక తరలించేందుకు ప్రయత్నిస్తే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. సీనియర్ నా యకులు సుంకర సీతారామ్, కోట వెంకటేశ్వరరావు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు కేతా తాతరావు, టౌన్ అధ్యక్షుడు పెచ్చెట్టి సత్యనారాయణ, బీసీ నాయకులు కాండ్రేకుల కనకయ్య, గుబ్బల రామకృష్ణ, నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షుడు చదలవాడ ముత్యాలరావు, కోట గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా వింగ్ జిల్లా నూతన కార్యవర్గం భీమవరంలో గురువారం ఎన్నికై ంది. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్.మానస, పి.రాజ్యలక్ష్మి, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పి. నిర్మల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు వై.మోహన్‌రావు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా జి.సత్యనారాయణ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
భీమవరం: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న విజయవాడ ధర్నాచౌక్‌లో డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్టు జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎన్.శ్రీనివాసరావు, ఆర్‌ఎల్ కేశ్వరరావు గురువారం ప్రకటనలో తెలిపారు.
నరసాపురం రూరల్: మొగల్తూరు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం–3కు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గతేడాది సెప్టెంబర్ 24న నిర్వహించిన సర్వేలో 91.43 మార్కులతో ఉత్తమంగా నిలిచినట్టు వైద్యులు తెలిపారు. ఆరోగ్య ఉప కేంద్రం వైద్య సిబ్బంది సమష్టి కృషి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందిస్తూ అత్యుత్తమ ప్రమాణాలు కనబర్చడంతో అవార్డు లభించిందన్నారు. కేంద్రం డాక్టర్లు కె.లక్ష్మీపార్వతి, జి.హేన, సీహెచ్‌ఓ వై.సత్యవతి, ఏఎన్‌ఎం శ్రీనివాస్, సూపర్‌వైజర్లు కె.భాస్కరరావు, కె.శ్రీనివాసరావు, కె.విజయలక్ష్మి, సిబ్బందిని పలువురు అభినందించారు.


