జగన్‌ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం
తణుకు అర్బన్: రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ యాక్టివిటీ సెక్రటరీ కసిరెడ్డి వజ్ర భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం తణుకు పద్మశ్రీ ఫంక్షన్ హాలులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నా గేశ్వరరావు అధ్యక్షతన పార్టీ సంస్థాగత విస్త్రృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా నూరుశాతం పారదర్శకంగా కమిటీలు వేయాలనే ఉద్దేశంతో కార్యాచర ణ చేశామన్నారు. వచ్చేనెల 10లోపు 8,500 మందితో కమిటీలు వేసి డిజిటలైజేషన్ పూర్తిచేస్తామని, తూర్పు, పశ్చిమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించి ఫిబ్రవరి 22లోపు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే 10 నియోజకవర్గాలకు సంబంధించి కడప పార్లమెంట్ పుంగనూరు, వేమూరు, మడకశిర నియోజకవర్గాల్లో ఆర్గనైజేషన్ యాక్టివిటీ కార్యక్రమాలు, రచ్చబండ కార్యక్రమాలను రూపొందించామన్నారు. గ్రామస్థాయి నుంచే పాలన సాగాలనే జగనన్న ఉద్దేశంతో ఈ కమిటీల నిర్ణయాలను ఆచరణలో పెడతామన్నారు. తణుకు నియోజకవర్గాన్ని రాష్ట్రానికి దశదిశ నిర్దేశించేలా కమిటీలను రూపొందిస్తామని అన్నారు. పార్టీ కార్యకర్తలను పూర్తిస్థాయిలో కాపాడుకునే రీతిలో పనిచేస్తున్నామన్నారు.
కమిటీలతో పార్టీ మరింత బలోపేతం
క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు వేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి అన్నారు. రాష్ట్ర వ్యాప్త కమిటీల్లో భాగంగా కడప, పుంగనూరు, మడకశిర వంటి ఏడు నియోజకవర్గాల్లో పూర్తిచేసుకుని వజ్ర భాస్కర్‌రెడ్డి తణుకు వచ్చారని, రెండు రోజుల వ్యవధిలోనే కమిటీల ఏర్పాటు ప్రక్రియ చురుగ్గా సాగిందని అన్నారు. ఈనెల 21న తణుకు, తణుకు రూరల్, ఇరగవరం, అత్తిలి మండలాల్లో సమావేశాలు నిర్వహించనున్నామని, గ్రామాల్లో సైతం విడిగా సమావేశాలు నిర్వహించి కమిటీల సభ్యులు, వైఎస్సార్‌సీపీ కుటుంబసభ్యులతో కలిసి పనిచేయనున్నామని అన్నారు. చంద్రబాబు సర్కారు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఎన్ని కేసులు పెడుతున్నా బెదరకుండా నిలబడటం గొప్పద నమన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, స్టేట్ లీగల్ సెల్ అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ హబీబుద్దీన్, తణుకు, అత్తిలి, ఇరగవరం మండల అధ్యక్షులు పెనుమర్తి వెంకటరామన్న, పైబోయిన సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, ఏఎంసీ మాజీ చైర్మన్‌లు బుద్దరాతి భరణిప్రసాద్, ఉండవల్లి జానకి, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షుడు పెనుమాల రాజేష్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఆర్గనైజేషన్ యాక్టివిటీ సెక్రటరీ వజ్ర భాస్కర్‌రెడ్డి


