ప్రాణాలైనా అర్పిస్తాం
భూసేకరణ కోసం ప్రభుత్వం కనీసం ఎలాంటి గ్రామ సభలు నిర్వహించలేదు. రైతుల అభిప్రా యాలు తీసుకోలేదు. ఏకపక్షంగా భూసేకరణ అప్రజాస్వామికం. ఒక ప్రజాప్రతినిధిగా ఈ చర్యను వ్యతిరేకిస్తున్నా.
– అబ్బు సుబ్రహ్మణేశ్వరరావు, సర్పంచ్,
మంగపతిదేవిపేట, కొయ్యలగూడెం మండలం
భూములను కోల్పోయే వారిలో అంతా చిన్న, సన్నకారు రైతులే. వీరికి వ్యవసాయమే జీవనాధారం. భూములను కోల్పోతే వీరంతా రోడ్డున పడతారు. ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోవాలి.
– టి.శ్రీనివాస్, ఎంపీటీసీ,
మంగపతిదేవిపేట, కొయ్యలగూడెం మండలం
నాకు ఎకరా భూమి వారసత్వంగా రాగా దీనిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నా. ఇప్పుడు ఆ భూమిని తీసుకుని కొంత పరిహారం ఇస్తే సరిపోతుందా. జీవనాధారాన్ని కోల్పోతాం.
– ఏకుల శ్రీను, రైతు, బోడిగూడెం
ఏలూరు (టూటౌన్): ‘మా ప్రాణాలైనా అర్పిస్తాం.. కానీ మా భూములను మాత్రం నేవీ ఆయుధ క ర్మాగారానికి ఇచ్చేది లేదు’ అంటూ బాధిత రైతులు తెగేసి చెబుతున్నారు. కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, బర్కెట్ నగరం, మంగపతిదేవిపేట, ఊట్లగూడెం, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం రేగులగుంట గ్రామాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు నిరసన బాట పట్టారు. బోడిగూడెం పంచాయతీ పరిధి బర్కెట్ నగరం ప్రాంతంలో 1,200 ఎకరాల్లో నేవీ ఆయుధ కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడాన్ని వీరంతా వ్యతిరేకిస్తున్నారు. ఈ కర్మాగారం ఏర్పా టుతో చిన్న, సన్నకారు రైతులు జీవనోపాధి కో ల్పోయి రోడ్డుపాలవుతామని ఆవేదన చెందుతు న్నారు. కనీసం తమ అనుమతి తీసుకోకుండా, గ్రా మసభలు నిర్వహించకుండా భూములను లాక్కోవాలని చూడటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా ఇటీవల ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
మాకెవరికీ ఇష్టం లేదు
తమ ప్రాంతంలో నేవీ ఆయుధ కర్మాగారం ఏర్పా టుచేస్తున్నట్టు గతనెలలో పత్రికల్లోనే చూశామని, అప్పటివరకూ ఈ విషయం తమకు తెలియదని బాధితులు అంటున్నారు. అయితే తమ వాదనలకు భిన్నంగా రెవెన్యూ అధికారులు మాత్రం స్థానిక రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధం ఉన్నట్లు ప్ర భుత్వానికి నివేదిక పంపడం విడ్డూరంగా ఉందంటున్నారు. తమ ప్రాంతంలోని ఒకరిద్దరు అవినీతిప రుల చర్యలను సాకుగా చూపి వందలాది మంది రై తుల భూములను బలవంతంగా లాక్కోవాలనుకోవడం దుర్మార్గమని మండిపడుతున్నారు. భూ ములను ఇచ్చేందుకు తామెవరికీ ఇష్టం లేదని అలాంటప్పుడు మా భూములను ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం : కర్మాగారం ఏర్పాటు విషయంలో అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం గ్రామసభలు పెట్టి ప్రాజెక్టు పరిధిలోని రైతులతో మాట్లాడలేదని ఆరోపిస్తున్నారు. స్థానిక రైతు ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా భూములను సేకరించాలని చూస్తే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతా చిన్న, సన్నకారు రైతులే..
ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూముల్లో అందరూ చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఎకరా, రెండెకరాలు ఉన్న వారే అధికం. ఈ ప్రాంతంలో భూసేకరణ చేస్తే సుమారు 500 మందికి పైగా రైతులు నిర్వాసితులు కానున్నారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర పరిహారం వల్ల వీరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. బలవంతంగా భూసేకరణ చేస్తే తామంతా చెల్లాచెదురవుతామని, తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పునరాలోచన చేయాలని కోరుతున్నారు.
ఆయుధ డిపోపై సమరభేరి
నేవీ ఆయుధ కర్మాగార బాధిత రైతుల్లో ఆందోళన
కర్మాగారానికి భూములిచ్చేది లేదంటూ తేల్చిచెప్పిన వైనం
గ్రామ సభలు నిర్వహించకపోవడంపై మండిపాటు
జీవనాధారం కోల్పోతామంటున్న కర్షకులు
ప్రాణాలైనా అర్పిస్తాం
ప్రాణాలైనా అర్పిస్తాం
ప్రాణాలైనా అర్పిస్తాం


